కెన‌డా-బోస్నియా మ్యాచ్‌ డ్రా | FIFA World Cup 2026: Canada Secure First-Ever World Cup Point In Dramatic Draw | Sakshi
Sakshi News home page

FIFA World Cup 2026: కెన‌డా-బోస్నియా మ్యాచ్‌ డ్రా

Jun 13 2026 7:15 AM | Updated on Jun 13 2026 10:35 AM

 FIFA World Cup 2026: Canada Secure First-Ever World Cup Point In Dramatic Draw

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో భాగంగా టొరంటో వేదిక‌గా కెన‌డా-బోస్నియా మ‌ధ్య జ‌రిగిన గ్రూపు-బి మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో ఇరు జ‌ట్ల‌కు చెరో పాయింట్ ల‌భించింది. ఈ డ్రాతో కెనడా తన ఫిఫా ప్రపంచ కప్ చరిత్రలోనే మొట్టమొదటి పాయింట్‌ను సొంతం చేసుకుంది. 

మ్యాచ్ 21వ నిమిషంలో బోస్నియా ఫార్వర్డ్ ఆటగాడు జోవో లుకిచ్ కార్నర్ కిక్ ద్వారా అద్భుత‌మైన గోల్ చేసి త‌న జ‌ట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ త‌ర్వాత 78 నిమిషలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన కెనడా ఆటగాడు సైల్ లారిన్ సూప‌ర్ గోల్ కొట్టి స్కోరును 1-1తో స‌మం చేశాడు. 

ఫ‌స్ట్‌హాఫ్‌లో కెన‌డా స్ట్రైక‌ర్ జోనాథ‌న్ డేవిడ్ గోల్ చేసేందుకు మంచి అవ‌కాశాన్ని కోల్పోయాడు. అదేవిధంగా రెండవ అర్ధభాగంలో బోస్నియా కెప్టెన్ సియాద్ కొలాసినాక్ కొట్టిన బంతి క్రాస్‌బార్‌కు తగిలి వెనక్కి రావడంతో వారికి లీడ్ సాధించే ఛాన్స్‌ను కోల్పోయారు. కాగా ఈ టోర్నీకి కెన‌డా స‌హా ఆతిథ్య దేశంగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement