చరిత్ర సృష్టించిన దేవ్‌దత్ పడిక్కల్.. తొలి భారత క్రికెటర్‌గా | Devdutt Padikkal creates history, becomes first Indian to score hundred on Independence Day | Sakshi
Sakshi News home page

IND vs SL: చరిత్ర సృష్టించిన దేవ్‌దత్ పడిక్కల్.. తొలి భారత క్రికెటర్‌గా

Aug 15 2026 7:07 PM | Updated on Aug 15 2026 7:12 PM

Devdutt Padikkal creates history, becomes first Indian to score hundred on Independence Day

గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత యువ బ్యాటర్ దేవ్‌దత్త్ పడిక్కల్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 134 బంతుల్లో తన తొలి అంతర్జాతీయ సెంచరీ మార్క్‌ను పడిక్కల్ అందుకున్నాడు. ఈ క్రమంలో పడిక్కల్ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఆగస్టు 15 (స్వాతంత్య్ర దినోత్సవం) నాడు టెస్ట్ సెంచరీ సాధించిన తొలి భారత బ్యాటర్‌గా అతడు చరిత్ర సృష్టించాడు.

పడిక్కల్ కంటే ముందు భారత తరపున ఏ బ్యాటర్ కూడా ఇండిపెండెన్స్ డే రోజు టెస్టుల్లో మూడంకెల స్కోర్‌ను అందుకోలేదు. గతంలో విరాట్ కోహ్లి వెస్టిండీస్‌పై ఆగస్టు 15న వన్డే సెంచరీ చేయగా.. టెస్టు సెంచరీ చేసింది మాత్రం పడిక్కలే కావడం గమనార్హం. అదేవిధంగా 21వ శతాబ్దంలో టీమిండియా తరపున మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి టెస్ట్ సెంచరీ బాదిన రెండో ప్లేయర్‌గా పడిక్కల్ రికార్డులెక్కాడు.

ప‌డిక్క‌ల్ కంటే ముందు సౌరవ్ గంగూలీ మాత్రమే ఈ ఘనత సాధించాడు. ఓవ‌రాల్‌గా భారత్ తరఫున నెంబర్ 3 పొజిషన్‌లో టెస్ట్ సెంచరీ సాధించిన ఎడ‌మ చేతి వాటం బ్యాట‌ర్‌గా  సలీమ్ దురానీ, బాపూ నాడ్కర్ణి, అజిత్ వాడేకర్, ఏక్‌నాథ్ సోల్కర్, సురీందర్ అమర్‌నాథ్, వినోద్ కాంబ్లీ పడిక్కల్ చేరాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement