బెర్లిన్‌లో ఫ్రెండ్లీ మ్యాచ్‌.. నాలుగు వికెట్ల తేడాతో.. | Independence Day Embassy vs Diaspora T20 cricket match in Berlin | Sakshi
Sakshi News home page

బెర్లిన్‌లో ఫ్రెండ్లీ మ్యాచ్‌.. నాలుగు వికెట్ల తేడాతో..

Aug 15 2026 5:17 PM | Updated on Aug 15 2026 5:18 PM

Independence Day Embassy vs Diaspora T20 cricket match in Berlin

భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బెర్లిన్‌లో ఇండియన్‌ ఎంబసీ, ఇండియన్‌ డైయాస్‌పోరా జట్ల మధ్య ఫ్రెండ్లీ టీ20 మ్యాచ్‌ నిర్వహించారు. చారిత్రక ఒలింపియాస్టేడియాన్‌ మైఫీల్డ్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ ఇందుకు ఆతిథ్యం ఇచ్చింది.

భారత రాయబార జట్టు 118 పరుగులు సాధించగా.. జర్మనీలోని ఇండియా అంబాసిడర్‌ 54 పరుగులతో రాణించారు. ఇందుకు ప్రతిగా ఇండియన్‌ డైయాస్‌పోరా టీమ్‌ 16 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఈ లక్ష్యాన్ని ఛేదించింది. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ బెర్లిన్‌ (ICAB) ఫౌండర్‌, ప్రెసిడెంట్‌ డాక్టర్‌ రఘు చలిగంటి ఈ జట్టుకు నాయకత్వం వహించారు.

ప్రవాస భారతీయులు, ఇండియన్‌ ఎంబసీ మధ్య జరిగిన ఈ ఫ్రెండ్లీ మ్యాచ్‌ను హర్‌ ఘర్‌ తిరంగా క్యాంపెయిన్‌లో భాగంగా నిర్వహించారు. జర్మనీలో నివసిస్తున్న భారతీయులు, ఇండియన్‌ ఎంబసీ మధ్య బంధం మరింత బలపడేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపకరిస్తాయని నిర్వాహకులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement