అదృష్టమంటే నీదే గ్రీన్‌!.. డబుల్‌ ధమాకా! | AUS vs BAN Green survives ball hits stumps races for boundary Video | Sakshi
Sakshi News home page

అదృష్టమంటే నీదే గ్రీన్‌!.. డబుల్‌ ధమాకా!

Aug 15 2026 2:47 PM | Updated on Aug 15 2026 3:04 PM

AUS vs BAN Green survives ball hits stumps races for boundary Video

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఆస్ట్రేలియా పోరాడుతోంది. డార్విన్‌ వేదికగా శనివారం నాటి మూడో రోజు ఆట పూర్తయ్యే సరికి కూడా.. బంగ్లా కంటే వెనుకబడే ఉంది. కాగా రెండు దశాబ్దాల అనంతరం ఆసీస్‌ గడ్డపై టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న బంగ్లాదేశ్‌ అదరగొడుతున్న సంగతి తెలిసిందే.

ఆధిక్యంలోనే బంగ్లాదేశ్‌
తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య కంగారూ జట్టును 198 పరుగులకే పరిమితం చేసిన బంగ్లాదేశ్‌... తమ మొదటి ఇన్నింగ్స్‌లో 426 పరుగులకు ఆలౌట్‌ అయింది. తద్వారా 228 పరుగుల మేర భారీ ఆధిక్యం సంపాదించింది బంగ్లాదేశ్‌.

ఈ క్రమంలో తొలి రెండు రోజులు ఆధిపత్యం కొనసాగించిన బంగ్లా.. శనివారం నాటి మూడో రోజు ఆటలోనూ జోరు కొనసాగించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో చెలరేగిన బంగ్లా పేసర్‌ హసన్‌ మహమూద్‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆసీస్‌కు చుక్కలు చూపిస్తున్నాడు.

క్రీజులో గ్రీన్‌, క్యారీ 
మహమూద్‌ బౌలింగ్‌లో ఓపెనర్లు ట్రవిస్‌ హెడ్‌ (17), జేక్‌ వెదర్లాండ్‌ (0) బౌల్డ్‌ అయ్యారు. మిగతా వారిలో వన్‌డౌన్‌ బ్యాటర్‌ మార్నస్‌ లబుషేన్‌ 31 పరుగులతో రాణించాడు. అయితే, తైజుల్‌ ఇస్లాం బౌలింగ్‌లో బౌల్డ్‌ అయి పెవిలియన్‌ చేరాడు. ఇక స్టీవ్‌ స్మిత్‌ 44 పరుగులు చేసి మెహిదీ హసన్‌ మిరాజ్‌ బౌలింగ్‌లో నిష్క్రమించాడు.

ఈ క్రమంలో మూడో రోజు ఆట పూర్తయ్యేసరికి కామెరాన్‌ గ్రీన్‌, అలెక్స్‌ క్యారీ క్రీజులో నిలిచారు. గ్రీన్‌ 86 బంతుల్లో 43 పరుగులు, క్యారీ 50 బంతుల్లో 19 పరుగులతో ఉన్నారు. ఫలితంగా 53 ఓవర్లలో ఆసీస్‌ నాలుగు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేయగలిగింది. బంగ్లాదేశ్‌ కంటే ఇంకా 67 పరుగులు వెనుకబడి ఉంది.

డబుల్‌ ధమాకా
ఇదిలా ఉంటే.. శనివారం నాటి ఆటలో కామెరాన్‌ గ్రీన్‌ అదృష్టవశాత్తూ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.  31వ ఓవర్‌లో టస్కిన్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో గ్రీన్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే, బంతి స్టంప్స్‌కు తాకింది.. కానీ బెయిల్స్‌ను పడగొట్టలేదు. అంతేకాదు.. బౌండరీ దిశగా దూసుకుపోయింది.

దీంతో ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాక గ్రీన్‌ ఆశ్చర్యపోయాడు. మొత్తానికి లక్కీగా అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మరోవైపు.. బంగ్లాదేశ్‌ శిబిరం ఊహించని ఈ పరిణామానికి బిక్కముఖం వేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.  

హెడ్‌ అతికించాడేమో!
ఈ నేపథ్యంలో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇదేందయ్యా ఇది! ఇది మేము చూడలేదు.. అదృష్టం అంటే నీదే. బహుశా ట్రవిస్‌ హెడ్‌ గమ్‌తో బెయిల్స్‌ను అంటించాడేమో! అందుకే అవి పడలేదు’’ అని ఫన్నీ రియాక్షన్స్‌ ఇస్తున్నారు. కాగా హసన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయిన తర్వాత హెడ్‌ బెయిల్స్‌ సర్ది మెల్లగా క్రీజును వీడాడు. 

చదవండి: వారెవ్వా హెడ్‌.. నా కెరీర్‌లో ఇలాంటిది చూడలేదు: గిల్‌క్రిస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement