రెండేళ్ల తర్వాత భారత టెస్టు జట్టులోకి వచ్చిన దేవ్‌దత్త్ పడిక్కల్.. తన రీఎంట్రీ మ్యాచ్‌లో సత్తాచాటాడు. గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో పడిక్కల్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. ఈ కర్ణాటక బ్యాటర్ 134 బంతుల్లో తన మొదటి అంతర్జాతీయ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 9 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. కాగా సాయిసుదర్శన్ గాయం కారణంగా లంకతో సిరీస్‌కు దూరం కావడంతో పడిక్కల్‌కు జట్టులో చోటు దక్కింది. ఈ క్రమంలో తనకు లభించిన అవకాశాన్ని పడిక్కల్ సద్వినియోగపరుచుకున్నాడు.
పడిక్కల్ 105 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 61 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 234 పరుగులు సాధించింది. అయితే 77 పరుగులతో మంచి రిథమ్‌లో ఉన్న కేఎల్ రాహుల్ గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.


