పడిక్కల్‌ సూపర్‌ సెంచరీ.. భారీ స్కోర్‌ దిశగా భారత్‌ | India vs Sri Lanka Day 1: Padikkal unbeaten 131 puts India in command | Sakshi
Sakshi News home page

IND vs SL: పడిక్కల్‌ సూపర్‌ సెంచరీ.. భారీ స్కోర్‌ దిశగా భారత్‌

Aug 15 2026 6:09 PM | Updated on Aug 15 2026 6:40 PM

India vs Sri Lanka Day 1: Padikkal unbeaten 131 puts India in command

PC: X

గాలే వేదికగా శ్రీలంకతో తొలి టెస్టును భారత్ ఘనంగా ఆరంభించింది. మొదటి రోజు ఆటలో ఆతిథ్య జట్టుపై టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 73 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 288 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 

యువ బ్యాటర్ దేవ్‌దత్త్ పడిక్కల్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. పడిక్కల్ 131 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. అతడితో పాటు రిషబ్ పంత్‌(31) క్రీజులో  ఉన్నాడు. కాగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగన భారత్‌కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (32), రాహుల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. 

అయితే యశస్వి దురదృష్టవశాత్తూ రనౌటయ్యాడు. అదేవిధంగా సెంచరీ దిశగా దూసుకుపోతున్న రాహుల్‌(77) కండరాలు పట్టేయడంతో  రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కేవలం 16 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య ఒక్కడే వికెట్ పడగొట్టాడు.
చదవండి: బీసీసీఐ బిగ్ ట్విస్ట్.. అగార్కర్‌కు చెక్? రేసులోకి ఊహించని పేరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement