పురుషుల హాకీ ప్రపంచ కప్ 2026ను భారత జట్టు విజయంతో ఆరంభించింది. శనివారం వాగెనర్ స్టేడియం వేదికగా పూల్ డి ఆరంభ మ్యాచ్‌లో వేల్స్‌పై 3-1 తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. తొలి క్వార్టర్‌లోనే భారత ఆటగాళ్ళు పెనాల్టీ కార్నర్ల రూపంలో లభించిన అవకాశాలను భారత ఆటగాళ్లు చక్కగా వినియోగించుకున్నారు.
మనజట్టుకు మొత్తం ఐదు పెనాల్టీ కార్నర్‌లు లభించగా.. మూడింటిని గోల్స్‌గా మార్చింది. తొలి క్వార్టర్‌లో సంజయ్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ చెరో రెండు పెనాల్టీ కార్నర్ గోల్స్‌తో భారత్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లారు. రెండో క్వార్టర్‌లో ఇరుజట్లూ ఒక్క గోల్ చేయలేకపోయాయి. మూడో క్వార్టర్‌లోని 43వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ తన రెండో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి 3-0తో జట్టు విజయాన్ని లాంఛనం చేశాడు.
మ్యాచ్ 55వ నిమిషంలో వేల్స్ ఆటగాడు శామ్ వెల్ష్ ఓ గోల్ సాధించి తన జట్టు ఖాతా తెరిచాడు. అయినప్పటికే మ్యాచ్ వేల్స్ చేజారిపోయింది. భారత్ తమ రెండో మ్యాచ్‌లో ఆగస్టు 17న ఇంగ్లండ్‌తో తలపడనుంది.


