ఆసీస్‌పై సెహ్వాగ్‌ కొడుకు మెరుపులు.. ద్రవిడ్‌ కుమారుడి విధ్వంసం | Rahul Dravid's Son Bats With A Strike Rate Of 211.11, Aaryavir Sehwag Scores 28 On India U19 Debut | Sakshi
Sakshi News home page

IND vs AUS: సెహ్వాగ్‌ కొడుకు మెరుపులు.. ద్రవిడ్‌ కుమారుడి విధ్వంసం

Sep 18 2026 4:52 PM | Updated on Sep 18 2026 5:16 PM

Rahul Dravid's Son Bats With A Strike Rate Of 211.11, Aaryavir Sehwag Scores 28 On India U19 Debut

PC: BCCI/X

రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరుగుతున్న అనాధికారిక తొలి వన్డేలో భారత యువ బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. వర్షం కారణంగా 20 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో.. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బ్యాటర్లలో యశ్‌వర్ధన్ చౌహాన్ (34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

అదరగొట్టిన అన్వయ్, ఆర్యవీర్
ఈ మ్యాచ్‌లో యశ్‌తో పాటు భారత దిగ్గజ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్‌ల కుమారులు అన్వయ్ ద్రవిడ్, ఆర్యవీర్ సెహ్వాగ్‌లు మెరిశారు. భారత అండర్-19 జట్టు తరఫున అరంగేట్రం చేసిన ఆర్యవీర్, తన తండ్రి శైలిలోనే దూకుడుగా ఆడుతూ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు.

అతడు 26 బంతుల్లో 5 ఫోర్లతో 28 పరుగులు చేశాడు. అదేవిధంగా ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అన్వయ్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 18 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
చదవండి: AUS vs ZIM: ట్రావిస్‌ హెడ్‌ విధ్వంసం.. ఫాస్టెస్ట్‌ సెంచరీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement