PC: BCCI/X
ఆస్ట్రేలియా అండర్-19తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల అనాధికారిక వన్డే సిరీస్‌లో భారత అండర్-19 జట్టు బోణీ కొట్టింది. శుక్రవారం రాజ్‌కోట్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో భారత్ సంచలన విజయం సాధించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 20 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత యువ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోరు సాధించింది.
భారత ఇన్నింగ్స్‌లో యశ్‌వర్ధన్ చౌహాన్ (34 బంతుల్లో 54) టాప్ స్కోరర్‌గా నిలవగా, అన్వయ్ ద్రవిడ్ (18 బంతుల్లో 38), అరంగేట్ర ప్లేయర్ ఆర్యవీర్ సెహ్వాగ్ (26 బంతుల్లో 28) ధనాధన్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. ఆసీస్ బౌలర్లలో స్పెన్సర్ గ్రీన్, ఎలీ బ్రెయిన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు చేసి ఓటమిపాలైంది.
ఆసీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ జాక్ జోస్నెక్ (55) నీల్ పటేల్ (45), హేడెన్ బార్బులోవిక్ (40) రాణించినప్పటికీ మిడిలార్డర్ వైఫల్యంతో ఓటమి తప్పలేదు. చివరి ఓవర్లో ఆస్ట్రేలియా విజయానికి 11 పరుగులు అవసరం కాగా.. భారత పేసర్ మోహిత్ ఉల్వా కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి భారత్‌కు థ్రిల్లింగ్ విజయాన్ని అందించాడు. భారత బౌలర్లలో యశ్‌వర్ధన్ చౌహాన్ రెండు వికెట్లు తీశాడు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే సెప్టెంబర్ 21న జరగనుంది.
చదవండి: IND vs AUS: సెహ్వాగ్ కొడుకు మెరుపులు.. ద్రవిడ్ కుమారుడి విధ్వంసం


