breaking news
Indian Under-19
-
అండర్–19 సారథిగా ఆయుశ్
న్యూఢిల్లీ: ఐపీఎల్లో అదరగొడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ ఆయుశ్ మాత్రే భారత అండర్–19 జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రాజస్తాన్ రాయల్స్ తరఫున ఈ సీజన్ ఐపీఎల్లో అరంగేట్రం చేసి... 35 బంతుల్లోనే సెంచరీతో సంచలనం రేకెత్తించిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. వచ్చే నెలలో భారత అండర్–19 జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఇందులో భాగంగా... 5 యూత్ వన్డేల సిరీస్‌తో పాటు 2 నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడనుంది. అంతకుముందు జూన్ 24న ఇంగ్లండ్ అండర్–19 జట్టుతో 50 ఓవర్ల వార్మప్ మ్యాచ్ కూడా ఆడనుంది. ఇప్పటికే యువ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆయుశ్, వైభవ్‌పై ఐపీఎల్‌తో మరిన్ని అంచనాలు పెరిగాయి. గతేడాది ఆ్రస్టేలియా అండర్–19 జట్టుపై వైభవ్ సెంచరీతో ఆకట్టుకోగా... 17 ఏళ్ల ఆయుశ్ 9 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 7 లిస్ట్ ‘ఎ’ మ్యాచ్‌లాడి 962 పరుగులు చేశాడు. ముంబై వికెట్ కీపర్ బ్యాటర్ అభిజ్ఞాన్ కుందు ఈ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గతేడాది ఆస్ట్రేలియా అండర్–19 జట్టుతో రెండు మ్యాచ్‌ల యూత్ టెస్టు సిరీస్ 16 వికెట్లతో అదరగొట్టిన కేరళ లెగ్‌స్పిన్నర్ మొహమ్మద్ ఇనాన్‌తో పాటు పంజాబ్ ఆఫ్‌స్పిన్నర్ అన్మోల్జీత్ సింగ్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు. స్టాండ్‌బై ఆటగాళ్ల జాబితాలో హైదరాబాద్ వికెట్‌కీపర్ రాపోలు అలంకృత్‌కు స్థానం లభించింది. భారత అండర్–19 జట్టు: ఆయుశ్ మాత్రే (కెపె్టన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్‌సింగ్, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు, హర్వంశ్ సింగ్, అంబరీశ్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, యుధజిత్ గుహ, ప్రణవ్ రాఘవేంద్ర, మొహమ్మద్ ఇనాన్, ఆదిత్య రాణా, అన్మోల్జీత్ సింగ్. స్టాండ్‌బై ప్లేయర్లు: నమన్ పుష్పక్, దీపేశ్, వేదాంత్ త్రివేది, వికల్ప్ తివారీ, రాపోలు అలంకృత్. -
ఆసియాకప్‌లో టీమిండియా బోణీ.. అఫ్గానిస్తాన్ చిత్తు
అండర్-19 ఆసియాకప్‌లో టీమిండియా బోణీ కొట్టింది. దుబాయ్ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో భారత యువ జట్టు ఘన విజయం సాధించింది. భారత విజయంలో కెప్టెన్ కులకర్ణి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో కీలక పాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 173 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో రాజ్ లింబానీ, కులకర్ణి తలా మూడు వికెట్లు పడగొట్టి అఫ్గాన్ పతనాన్ని శాసించగా.. నమాన్ తివారీ రెండు వికెట్లు సాధించాడు. అఫ్గాన్ బ్యాటర్లలో ఓపెనర్ జమ్షీడ్ జద్రాన్ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 174 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 37.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్ కులకర్ణి(70) పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. అతడితో పాటు ముషీర్ ఖాన్ 48 పరుగులతో రాణించాడు. ఇక టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌లో డిసెంబర్ 10న దాయాది పాకిస్తాన్‌తో తలపడనుంది. -
భారత్ క్రికెట్లో మెరిసిన తెలుగు తేజం.. కీలక బాధ్యతల్లో..
ప్రత్తిపాడు/గుంటూరు: అంతర్జాతీయ క్రికెట్లో తెలుగుతేజం మెరిసింది. వెస్టిండీస్‌లో జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు జరగనున్న ఐసీసీ అండర్–19 మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2022కు బీసీసీఐ భారత్ టీంను ప్రకటించింది. పదిహేడు మంది సభ్యులతో ప్రకటించిన భారత్ టీంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నుంచి వైస్ కెప్టెన్‌గా షేక్ రషీద్ ఎంపికయ్యాడు. రషీద్ మన జిల్లా వాసే. ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెంకు చెందిన షేక్ బాలీషా, జ్యోతిలకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు రియాజ్ మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతుండగా, రెండవ కుమారుడు రషీద్ ప్రస్తుతం నరసరావుపేటలోని రెడ్డి కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. తండ్రి వృత్తిరీత్యా ప్రైవేటు ఉద్యోగి కావడం, కుమారుడి ప్రాక్టీస్ నిమిత్తం వీరు ప్రస్తుతం గుంటూరులోని హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నారు. పన్నెండేళ్ల వయస్సులోనే.. రషీద్‌కు చిన్నతనం నుంచే క్రికెట్‌పై అమితమైన ఆసక్తి ఉంది. స్వతహాగా బ్యాటింగ్ అంటే మంచి ఇష్టమున్న రషీద్ ఆ దిశగానే తన ప్రయత్నాలను మొదలుపెట్టాడు. పన్నెండేళ్ల వయస్సులోనే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు సెలక్ట్ అయ్యాడు. మంగళగిరిలో ప్రత్యేక కోచ్‌ల ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నాడు. రషీద్‌కు తల్లిదండ్రుల నుంచి కూడా మంచి ప్రోత్సాహం ఉంది. కుమారుడి ప్రాక్టీసుకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో పదేళ్ల క్రితం కుటుంబంతో సహా గుంటూరుకు వెళ్లిపోయారు. కుర్రాడి ఎంపిక పట్ల తల్లిదండ్రులతో పాటు పాతమల్లాయపాలెం గ్రామస్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. చదవండి: IND Vs SA: ఓవర్‌లోడ్ బ్యాగ్ మోసుకుని వెళ్లిన కోహ్లి.. దాంట్లో ఏముంది! -
యశస్వి ఆల్‌రౌండ్ ప్రదర్శన
ఈస్ట్ లండన్ (దక్షిణాఫ్రికా): దక్షిణాఫ్రికా అండర్– 19 జట్టుతో జరిగిన రెండో అనధికారిక వన్డేలో భారత అండర్–19 జట్టు సభ్యుడు యశస్వి జైస్వాల్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. తొలుత బౌలింగ్ (4/13)లో విజృంభించిన యశస్వి... అనంతరం ఓపెనర్‌గా (56 బంతుల్లో 89 నాటౌట్; 14 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగాడు. ఫలితంగా శనివారం జరిగిన రెండో అనధికారిక వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా అనధికారిక 3 వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 29.5 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. ఆతి థ్య జట్టు తరఫున జొనాథన్ బర్డ్ చేసిన 25 పరుగులే టాప్ స్కోర్ కావడం గమనార్హం. యశస్వికి ఆకాశ్ సింగ్ (2/37), అథర్వ అన్కోలేకర్ (2/16), రవి బిష్ణోయ్ (2/20) చక్కటి సహకారం అందించారు. అనంతరం ఛేదన మొదలు పెట్టిన భారత్ 16.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసి విజయం సాధించింది. ఆరంభంలోనే సారథి ప్రియమ్ గార్గ్ (0), రావత్ (2) వికెట్లను కోల్పోయినా... ఓపెనర్ జైస్వాల్ టి20 తరహాలో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతనికి ధ్రువ్ జురెల్ (26 బంతుల్లో 26 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) తోడవటంతో భారత విజయం ఖాయమైంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించిన యశస్వికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభి ంచింది. చివరి వన్డే ఈ నెల 30న జరుగుతుంది. -
భారత యువ జట్టు ఘనవిజయం
చెస్టర్‌ఫీల్డ్: ఇంగ్లండ్ అండర్–19 జట్టుతో జరిగిన నాలుగు రోజుల అనధికార టెస్టు మ్యాచ్‌లో భారత అండర్–19 జట్టు 334 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆట చివరి రోజు 498 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 163 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో కమలేశ్ నాగర్కోటి ఐదు వికెట్లు పడగొట్టగా... అశోక్, శివమ్ రెండేసి వికెట్లు తీశారు. యూత్ టెస్టుల్లో పరుగుల పరంగా భారత్‌కు ఇదే భారీ విజయం కావడం విశేషం. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 519 పరుగులు చేయగా... ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకు ఆలౌటైంది. భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 6 వికెట్లకు 173 పరుగులవద్ద డిక్లేర్ చేసి ఇంగ్లండ్‌కు 498 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.