
వైభవ్ సూర్యవంశీకి చోటు
ఇంగ్లండ్ పర్యటనకు జట్టు ప్రకటన
న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో అదరగొడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ ఆయుశ్ మాత్రే భారత అండర్–19 జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రాజస్తాన్ రాయల్స్ తరఫున ఈ సీజన్ ఐపీఎల్‌లో అరంగేట్రం చేసి... 35 బంతుల్లోనే సెంచరీతో సంచలనం రేకెత్తించిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. వచ్చే నెలలో భారత అండర్–19 జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఇందులో భాగంగా... 5 యూత్ వన్డేల సిరీస్‌తో పాటు 2 నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడనుంది.
అంతకుముందు జూన్ 24న ఇంగ్లండ్ అండర్–19 జట్టుతో 50 ఓవర్ల వార్మప్ మ్యాచ్ కూడా ఆడనుంది. ఇప్పటికే యువ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆయుశ్, వైభవ్‌పై ఐపీఎల్‌తో మరిన్ని అంచనాలు పెరిగాయి. గతేడాది ఆ్రస్టేలియా అండర్–19 జట్టుపై వైభవ్ సెంచరీతో ఆకట్టుకోగా... 17 ఏళ్ల ఆయుశ్ 9 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 7 లిస్ట్ ‘ఎ’ మ్యాచ్‌లాడి 962 పరుగులు చేశాడు.
ముంబై వికెట్ కీపర్ బ్యాటర్ అభిజ్ఞాన్ కుందు ఈ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గతేడాది ఆస్ట్రేలియా అండర్–19 జట్టుతో రెండు మ్యాచ్‌ల యూత్ టెస్టు సిరీస్ 16 వికెట్లతో అదరగొట్టిన కేరళ లెగ్‌స్పిన్నర్ మొహమ్మద్ ఇనాన్‌తో పాటు పంజాబ్ ఆఫ్‌స్పిన్నర్ అన్‌మోల్‌జీత్ సింగ్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు. స్టాండ్‌బై ఆటగాళ్ల జాబితాలో హైదరాబాద్ వికెట్‌కీపర్ రాపోలు అలంకృత్‌కు స్థానం లభించింది.
భారత అండర్–19 జట్టు: ఆయుశ్ మాత్రే (కెపె్టన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్‌సింగ్, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు, హర్‌వంశ్ సింగ్, అంబరీశ్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, యుధజిత్ గుహ, ప్రణవ్ రాఘవేంద్ర, మొహమ్మద్ ఇనాన్, ఆదిత్య రాణా, అన్‌మోల్‌జీత్ సింగ్.
స్టాండ్‌బై ప్లేయర్లు: నమన్ పుష్పక్, దీపేశ్, వేదాంత్ త్రివేది, వికల్ప్ తివారీ, రాపోలు అలంకృత్.