
భారత అండర్-19 జట్టు ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా యంగ్ టీమిండియా ఆతిథ్య ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో మూడు వన్డేలు, రెండు టెస్టుల్లో తలపడనుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా పర్యటన కోసం 18 సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.
ఈ జట్టుకు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆయుష్ మాత్రే మరోసారి నాయకత్వం వహించనున్నాడు. అదేవిధంగా రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే రాహుల్ ద్రవిడ్ తనయుడు సమిత్ ద్రవిడ్‌కు మరోసారి సెలక్టర్లు మొండి చేయి చూపించారు.
ఇంగ్లండ్‌లో అదుర్స్..
ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన మాల్టీ ఫార్మాట్ సిరీస్‌లో భారత జట్టుకు మాత్రే కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా అదరగొట్టింది. యూత్ వన్డే సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకోగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ డ్రాగా ముగించింది. ఇంగ్లండ్ టూర్‌లో టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఉన్న వికెట్ కీపర్-బ్యాటర్ అభిజ్ఞాన్ కుండు కూడా తన స్ధానాన్ని పదిలం చేసుకున్నాడు.
కానీ ఆసీస్‌తో సిరీస్‌ల కోసం మాత్రే డిప్యూటీగా విహాన్ మల్హోత్రాను సెలక్టర్లు నియమించారు. అయితే ఇంగ్లండ్ పర్యటనలో గాయపడిన ఆదిత్య రాణా, ఖిలాన్ పటేల్‌లను సెలక్టర్లు జట్టు నుంచి తప్పించారు. వారిద్దరి స్ధానంలో డి. దీపేష్, నమన్ పుష్పక్‌లను ఎంపిక చేశారు.
ఆస్ట్రేలియాలో భారత అండర్-19 జట్టు షెడ్యూల్ ఇదే
21-సెప్టెంబర్-తొలి వన్డే- నార్త్స్
24-సెప్టెంబర్- రెండో వన్డే- నార్త్స్
26-సెప్టెంబర్- మూడో వన్డే- నార్త్స్
30-సెప్టెంబర్ నుంచి 3-అక్టోబర్ వరకు తొలి టెస్టు
07-అక్టోబర్ నుంచి 10-అక్టోబర్ వరకు రెండో టెస్టు
భారత అండర్ 19 జట్టు: ఆయుష్ మ్హత్రే (కెప్టెన్), విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, వేదాంత్ త్రివేది, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), హర్వాన్ష్ సింగ్, ఆర్ ఎస్ అంబ్రిష్, కనిష్క్ చౌహాన్, నమన్ పుష్పక్, హెనిల్ సింగ్, కిషన్ కుమార్, అన్మోల్, కిషన్ కుమార్, పటేల్, డి దీప్, పటేల్ మోహన్, అమన్ చౌహాన్.
చదవండి: పాకిస్తాన్‌తో సెమీస్ మ్యాచ్ రద్దు.. టోర్నీ నుంచి వాకౌట్ చేసిన భారత్..?