అజేయంగా భారత్‌ | Indian team wins over South Korea in Asian Champions Trophy hockey tournament | Sakshi
Sakshi News home page

అజేయంగా భారత్‌

Nov 3 2026 4:34 AM | Updated on Nov 3 2026 4:34 AM

Indian team wins over South Korea in Asian Champions Trophy hockey tournament

చివరి లీగ్‌ మ్యాచ్‌లో కొరియాపై 8–0తో గెలుపు 

రేపు సెమీస్‌లో కొరియాతోనే ‘ఢీ’

జలంధర్‌: ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత జట్టు లీగ్‌ దశను అజేయంగా ముగించింది. చివరి మ్యాచ్‌లో భారత్‌ 8–0 గోల్స్‌తో దక్షిణ కొరియాను చిత్తు చేసింది. భారత్‌ తరఫున దిల్‌ప్రీత్‌సింగ్‌ (8వ, 40వ ని.లో) రెండు గోల్స్‌ చేశాడు. జుగ్‌రాజ్‌ సింగ్‌ (11వ ని.లో), హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (15వ ని.లో), శిలానంద్‌ లాక్రా (33వ ని.లో), సుఖ్‌జీత్‌ సింగ్‌ (34వ ని.లో), సంజయ్‌ (36వ ని.లో), అంగద్‌బీర్‌ సింగ్‌ (60వ ని.లో) ఒక్కోగోల్‌ చేశారు. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన భారత్‌ 15 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. రేపు జరిగే సెమీఫైనల్స్‌లో కొరియాతో భారత్‌; జపాన్‌తో మలేసియా తలపడతాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement