source: X
గెబెర్హా వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో పర్యాటక ఆస్ట్రేలియా ఓటమి కొరల్లో చిక్కుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగులకే కుప్పకూలి ఫాలో ఆన్ ఆడుతున్న ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో కూడా తడబడుతుంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఆసీస్ ఇంకా 170 పరుగులు వెనుకపడి ఉంది. హెడ్ (87 నాటౌట్) ఆసీస్‌ను గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు.
అంతకుముందు యాన్సెన్ (5-33) ధాటికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో విలవిలలాడింది. యాన్సెన్‌తో పాటు రబాడ (2-33), ముల్దర్ (2-14), నోర్జే (1-5) కూడా వికెట్లు తీశారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో 28 పరుగులతో స్టీవ్ స్మిత్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
దీనికి ముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ (425-9 డిక్లేర్) చేసింది. 110 పరుగులకే 56 వికెట్లు కోల్పోయి కష్టాల్లో జట్టును టెంబా బవుమా వీరోచిత సెంచరీ (179)తో ఆదుకున్నాడు. టెయిలెండర్లు మార్కో యాన్సెన్ (85), సైమన్ హార్మర్ (82)తో కలిసి భారీ భాగస్వామ్యాలు (132, 182) నెలకొల్పి, జట్టును పటిష్ట స్థితికి చేర్చాడు. ఆసీస్ బౌలర్లలో బోలాండ్ 5, స్టార్క్ 3, లబూషేన్ ఓ వికెట్ పడగొట్టారు.
కాగా, వర్షం కారణంగా ఈ మ్యాచ్ తొలి రెండు రోజులు ఆట పెద్దగా సాధ్యపడలేదు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఆసీస్ తొలి టెస్ట్‌లో గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్.. 60 ఏళ్ల రికార్డు బ్రేక్


