PC: BCCI Women X
ఆసియా క్రీడలు-2026 మహిళల టీ20 టోర్నీలో భాగంగా నాలుగో క్వార్టర్ ఫైనల్‌లో భారత్- జపాన్ పోటీకి దిగాయి. నిశిన్‌లోని కరోగి స్పోర్ట్స్ పార్క్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
మూడు సెమీస్ బెర్తులు ఖరారు
కాగా సెప్టెంబరు 17- 22 మధ్య ఆసియా క్రీడల-2026 మహిళల టీ20 టోర్నీకి షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో గురువారం నాటి తొలి క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్- చైనా తలపడాల్సి ఉండగా.. వర్షం వల్ల టాస్ పడకుండానే మ్యాచ్ రద్దైపోయింది. ఫలితంగా ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా బంగ్లాదేశ్ సెమీ ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించింది.
ఇక రెండో క్వార్టర్ ఫైనల్లో థాయ్‌లాండ్‌పై మూడు వికెట్ల తేడాతో గట్టెక్కి పాకిస్తాన్ సెమీస్‌కు చేరింది. మరోవైపు.. మూడో క్వార్టర్ ఫైనల్లో శ్రీలంక మలేషియాపై 86 పరుగుల తేడాతో గెలిచి టాప్-4లో అడుగుపెట్టింది.
ఈ క్రమంలో తొలి సెమీ ఫైనల్లో పాకిస్తాన్- శ్రీలంక తలపడనుండగా.. భారత్- జపాన్ మధ్య మ్యాచ్ విజేతతో బంగ్లాదేశ్ రెండో సెమీస్ మ్యాచ్‌లో పోటీకి దిగనుంది.
తుదిజట్లు
భారత్
స్మృతి మంధాన, షఫాలి వర్మ, గుణాలన్ కమలిని, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), భారతి ఫుల్మలి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, శ్రీ చరణి, శ్రేయాంక పాటిల్, క్రాంతి గౌడ్, నందిని శర్మ
జపాన్
హరునా ఇవాసాకి, ఆకారి నిశిముర కానో, మైయ్ యనగిడ (కెప్టెన్), ఎరిక ఓడా, అహిల్య చందేల్, షిమాకో కాటో, అయాక కాటో- స్టఫోర్డ్, ఆయుమి ఫుజికావా, హినాసే గోటో (వికెట్ కీపర్), ఎరిక టొగుచి క్విన్, నొనొహా యసుమొటో.


