ఏషియన్ గేమ్స్ మహిళల క్రికెట్‌లో పాకిస్తాన్ జట్టు సెమీఫైనల్‌కు చేరింది. క్వార్టర్ ఫైనల్లో ఆ జట్టు థాయ్‌లాండ్‌పై అతికష్టం మీద 3 వికెట్ల తేడాతో గెలుపొంది, ఫైనల్-4కు అర్హత సాధించింది. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో పాక్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
నన్నపట్ కొంచరోయెంకై (49) రాణించడంతో థాయ్‌లాండ్ 4 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో ఫాతిమా సనా 2, నష్రా సంధు ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం 92 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు పాక్ నానా కష్టాలు పడింది. మరో 2 బంతులు మాత్రమే మిగిలుండగా, 7 వికెట్లు కోల్పోయి అతి కష్టం మీద గెలుపు తీరాలు చేరింది. ఒకట్రెండు బంతులు అటుఇటైనా పాక్‌కు ఘోర పరాభవం ఎదురయ్యేది. చచ్చీ చెడి తృటిలో ఆ పరాభవాన్ని తప్పించుకొని సెమీస్‌కు చేరింది.
షవాల్ జుల్ఫికర్ (25), ఫాతిమా సనా (21) ఓ మోస్తరు స్కోర్లు చేసి, పాక్ గెలుపుకు జీవం పోశారు. ఆఖర్లో తుబా హసన్ (13) బ్యాట్ ఝులిపించడంతో పాక్ బయటపడింది. థాయ్‌లాండ్ బౌలర్లు ఒన్నిచా కాంచోంపు (3-0-37-3), సులీపోర్న్ లావోమీ (2-0-3-1), సునిద (2-0-23-2) పాక్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు.
వాష్ అవుట్‌తో సెమీస్‌కు బంగ్లాదేశ్
మరో క్వార్టర్‌ఫైనల్‌లో బంగ్లాదేశ్, హాంకాంగ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ తడి అవుట్‌ఫీల్డ్ కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. అధిక సీడింగ్ కారణంగా బంగ్లాదేశ్ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.
ఇదీ చదవండి: ఒక్క బంతి పడకుండానే మ్యాచ్ రద్దు.. సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్


