Photo Credit: BCCI Twitter
అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-0తో టీమిండియా క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన చివరి టీ20లో భారత్ 127 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందిస్తూ అభిషేక్ శర్మపై ప్రశంసలు కురిపించాడు.
‘‘నిజానికి ఇది సులభమైన వికెట్ కాదు. కానీ అభిషేక్ ఆడిన తీరు కంటికి ఇంపుగా ఉంది. అతడొక అద్భుతం. అతడు శతకం సాధించడం చాలా ఆనందం కలిగించింది. అఫ్గానిస్తాన్ సిరీస్ కోల్పోయినప్పటికీ వాళ్లు మా మనసులు గెలిచారు. ఈ సిరీస్‌కు వాళ్లు ఆతిథ్యం ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా గౌరవం ఉంటుంది. ఓడినప్పటికీ ఆఫ్గన్ జట్టు ప్రదర్శన కూడా ప్రశంసనీయం.
టాస్‌కు ముందే ఆఫ్గన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్‌తో క్లుప్తంగా మాట్లాడిన తర్వాతే మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. మ్యాచ్‌లో మాకు అద్భుతమైన ఆరంభం లభించింది. అభిషేక్ విధ్వంసానికి తోడు శాంసన్ రాణించడంతో 200లకు పైగా రన్స్‌ను స్కోరుబోర్డుపై చేర్చగలిగాం.
అక్షర్ పటేల్ కీలక సమయంలో రాణిండంలో సిద్ధహస్తుడు. గతంలో చాలా సందర్భాల్లో జట్టును గెలిపించాడు. ఇప్పుడు కూడా అదే చేశాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఎలా బౌలింగ్ చేయాలనేది అతడికి బాగా తెలుసు. మొదటి నుండి నిలకడగా రాణిస్తున్నాడు. కాబట్టి అతడికి నా ప్రత్యేక అభినందనలు.’’ అని పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: బట్లర్ ప్రపంచ రికార్డు.. రెండో టీ20లో ఇంగ్లండ్ విజయం


