Photo Credit: BCCI Twitter
స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను టీమిండియా 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఢిల్లీ వేదికగా గురువారం జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 127 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్‌పై విజయం సాధించింది. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ భారత బౌలర్ల ధాటికి 14.1 ఓవర్లలో 94 పరుగులకు కుప్పకూలింది.

కెప్టెన్ ఇబ్రహీం జద్రన్ (25) మినహా మిగతావాళ్లు బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో నితీశ్ కుమార్ రెడ్డి, రవి బిష్ణోయి చెరో 3 వికెట్లు తీయగా, అక్షర్ పటేల్ 2 వికెట్లు, యశ్ ఠాకూర్, బుమ్రాలు తలా ఒక వికెట్ పడగొట్టారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.
అభిషేక్ శర్మ (34 బంతుల్లో 108; 9 ఫోర్లు, 11 సిక్సర్లు) శతకంతో విధ్వంసం సృష్టించగా.. సంజూ శాంసన్ (35 బంతుల్లో 50) అర్థసెంచరీ సాధించాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (29) రాణించాడు. అఫ్గానిస్తాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్‌జయ్ 2 వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్, అబ్దుల్లా అహ్మద్‌జయ్ చెరొక వికెట్ తీశారు. అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ టీమిండియానే విజయం సాధించి ఆఫ్గన్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. శతకంతో చెలరేగిన ఓపెనర్ అభిషేక్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
As clinical and commanding as it gets 🇮🇳#TeamIndia with a massive 1️⃣2️⃣7️⃣-run victory to clinch the Friendship Cup 3️⃣-0️⃣ 🏆
Scorecard ▶️ https://t.co/Zixki4RhPt#AFGvIND pic.twitter.com/ZDY4ZzdaxY— BCCI (@BCCI) September 17, 2026
ఇదీ చదవండి: అభిషేక్ ఫాస్టెస్ట్ సెంచరీ.. టీమిండియా భారీ స్కోర్


