అభిషేక్‌ మహోగ్రరూపం.. 36 బంతుల్లోనే భారత్‌ సెంచరీ | IND VS AFG 3rd T20I: Abhishek Sharma Completed half century in just 16 balls | Sakshi
Sakshi News home page

అభిషేక్‌ మహోగ్రరూపం.. 36 బంతుల్లోనే భారత్‌ సెంచరీ

Sep 17 2026 8:05 PM | Updated on Sep 17 2026 8:23 PM

IND VS AFG 3rd T20I: Abhishek Sharma Completed half century in just 16 balls

source: X

న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగగా.. ఆభిషేక్‌ విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. 

కేవలం​ 16 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన అతడు.. ఆతర్వాత కూడా అదే జోరును కొనసాగిస్తున్నాడు. అభిషేక్‌కు మరో ఓపెనర్‌ సంజూ శాంసన్‌ కూడా తోడవ్వడంతో భారత్‌ కేవలం 3.3 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును దాటింది.

తొలి ఓవర్ నుంచి ఆఫ్ఘన్‌ బౌలర్లపై ఎదురుదాడి ప్రారంభించిన అభిషేక్‌.. రెండో, మూడు, ఐదు, ఆరు ఓవర్లలో ఉగ్రరూపం దాల్చాడు. అభిషేక్‌ ధాటికి భారత్‌ 6 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును తాకింది. పవర్‌ప్లేలో 100 పరుగుల మార్కును తాకడం​ భారత్‌కు ఇది తొలిసారి. 

6 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 100-0గా ఉంది. అభిషేక్‌ 22 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 76 పరుగులు, సంజూ శాంసన్‌ 14 బంతుల్లో 3 సిక్సర్ల సాయంతో 24 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

ఇదీ చదవండి: ఆఫ్ఘన్‌తో మూడో టీ20.. టీమిండియాలో ఓ మార్పు


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement