ఐసీసీలో చారిత్రక నియామకం | Tavengwa Mukuhlani appointed ICC deputy chairperson | Sakshi
Sakshi News home page

ఐసీసీలో చారిత్రక నియామకం

Sep 17 2026 5:54 PM | Updated on Sep 17 2026 6:36 PM

Tavengwa Mukuhlani appointed ICC deputy chairperson

source: X

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌లో చారిత్రక నియామకం జరిగింది. బోర్డు చరిత్రలో తొలిసారి జింబాబ్వేకు చెందిన వ్యక్తికి కీలక పదవి దక్కింది. తవెంగ్వా ముకుహ్లాని ఐసీసీ డిప్యూటీ చైర్మన్‌గా ఎంపికైన తొలి జింబాబ్వియన్‌గా చరిత్రకెక్కాడు. ముకులాని ఐసీసీ అధ్యక్షుడు జై షాకు డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. జింబాబ్వే క్రికెట్‌కు దక్కిన అత్యున్నత గౌరవం ఇది. ఇమ్రాన్‌ ఖ్వాజా ఐసీసీ డిప్యూటీ చైర్మన్‌గిరికి రాజీనామా చేయడంతో ముకుహ్లాని ఎంపిక జరిగింది.

ప్రస్తుతం ముకుహ్లాని ఐసీసీ ఫైనాన్స్ అండ్ కమర్షియల్ అఫైర్స్ కమిటీ (F&CA), నామినేషన్స్ కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు. అలాగే హెచ్‌ఆర్ అండ్ రెమ్యునరేషన్ కమిటీకి అధ్యక్షత వహిస్తున్నారు. 2027 పురుషుల వన్డే ప్రపంచకప్‌కు జింబాబ్వే సహ ఆతిథ్య దేశంగా వ్యవహరించనున్న సమయంలో ముకుహ్లాని నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. 2027 ప్రపంచకప్ ద్వారా 24 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్ మళ్లీ ఆఫ్రికా ఖండానికి చేరుకోనుంది. 

ఇదీ చదవండి: టీమిండియాను గడగడలాడించిన ప్లేయర్‌కు ప్రతిష్టాత్మక అవార్డు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement