అప్పటికి 40 ఏళ్లు.. దయచేసి కెప్టెన్‌గా దిగిపో! | India Legend Requests Harmanpreet To Step Down give Good run to Smriti | Sakshi
Sakshi News home page

అప్పటికి 40 ఏళ్లు.. దయచేసి కెప్టెన్‌గా దిగిపో!

Sep 17 2026 6:20 PM | Updated on Sep 17 2026 6:35 PM

India Legend Requests Harmanpreet To Step Down give Good run to Smriti

Photo: BCCI X

హర్మన్‌ప్రీత్‌ కౌర్‌.. భారత మహిళా జట్టుకు తొలి ప్రపంచకప్‌ టైటిల్‌ అందించిన కెప్టెన్‌. సొంతగడ్డపై గతేడాది ఆమె సారథ్యంలో భారత్‌ వన్డే వరల్డ్‌కప్‌-2025 ట్రోఫీని కైవసం చేసుకుంది.

తొలి ఐసీసీ టైటిల్‌
నవీ ముంబైలోని డాక్టర్‌ డీవై పాటిల్‌ స్పోర్ట్స్‌ అకాడమీలో జరిగిన ఫైనల్లో హర్మన్‌ సేన.. సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి చాంపియన్‌గా అవతరించింది. ఈ క్రమంలో భారత మహిళా క్రికెట్‌ జట్టు తొలిసారి ప్రపంచకప్‌ సొంతం చేసుకోగా.. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ పేరు సువర్ణాక్షరాలతో చరిత్రలో నిలిచిపోయింది.

అయితే, టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో మాత్రం భారత జట్టు సత్తా చాటలేకపోయింది. ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన ఈ టోర్నీలో సెమీ ఫైనల్‌ చేరకుండానే ఇంటిబాటపట్టింది. అయితే, ఇటీవల ఆసియా టీ20 కప్‌-2026 టోర్నీలో మాత్రం హర్మన్‌ జట్టును విజేతగా నిలపగలిగింది.

కెప్టెన్‌ మార్పు అనివార్యం
ఈ పరిణామాల నేపథ్యంలో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ను ఉద్దేశించి భారత మహిళా క్రికెట్‌ దిగ్గజం డయానా ఎడుల్జి తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. వన్డే వరల్డ్‌కప్‌-2029 టోర్నీకి సన్నద్ధమయ్యే క్రమంలో కెప్టెన్‌ మార్పు అనివార్యమని డయానా అభిప్రాయపడింది. 37 ఏళ్ల హర్మన్‌ప్రీత్‌ కెప్టెన్సీకి రాజీనామా చేసి.. వైస్‌ కెప్టెన్‌, దిగ్గజ ఓపెనర్‌ 30 ఏళ్ల స్మృతి మంధాను పగ్గాలు ఇవ్వాలని సూచించింది.

అప్పటికి 40 ఏళ్లు.. దయచేసి కెప్టెన్‌గా దిగిపో!
‘‘స్మృతి మంధాన దీర్ఘకాలంగా జట్టుతో కొనసాగుతోంది. వచ్చే ప్రపంచకప్‌ నాటికి హర్మన్‌ వయసు 40 ఏళ్లకు చేరుతుంది. కాబట్టి ఇప్పుడే స్మృతికి పగ్గాలు ఇవ్వడం మంచిది. ఆమె నాయకత్వంలో ఇద్దరు యువ ప్లేయర్లకు వైస్‌ కెప్టెన్లుగా అవకాశం ఇవ్వాలి.

హర్మన్‌కు ఇదే నా మర్యాదపూర్వక విన్నపం. జెమీమా రోడ్రిగ్స్‌, షఫాలీ వర్మ వైస్‌ కెప్టెన్సీకి మంచి ఆప్షన్లు’’ అని డయానా ఎడుల్జి పేర్కొంది. కాగా ప్రస్తుతం భారత మహిళా జట్టు ఆసియా క్రీడలు-2026 టోర్నీ (టీ20)కి సన్నద్ధంగా ఉంది. సెప్టెంబరు 18న జపాన్‌తో క్వార్టర్‌ ఫైనల్లో హర్మన్‌సేన తలపడుతుంది. 

చదవండి: మా దారులు వేరయ్యాయి:  పృథ్వీ షా పెళ్లి రద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement