నేటి నుంచి దక్షిణ కొరియాతో భారత్ డేవిస్‌కప్ మ్యాచ్
సియోల్: డేవిస్‌కప్ కొత్త ఫార్మాట్‌లోకి మారాక భారత పురుషుల టెన్నిస్ జట్టు తొలిసారి వరల్డ్ ఫైనల్స్ టోర్నీ బెర్త్‌పై గురి పెట్టింది. దక్షిణ కొరియా జట్టుతో రెండు రోజులపాటు జరిగే క్వాలిఫయర్‌లో భారత జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఈ ఏడాది నవంబర్‌లో ఇటలీ వేదికగా ఎనిమిది జట్ల మధ్య నిర్వహించే డేవిస్‌కప్ వరల్డ్ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది. తొలి రోజు శుక్రవారం రెండు సింగిల్స్ మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి మ్యాచ్‌లో కొరియా నంబర్‌వన్, ప్రపంచ 150వ ర్యాంకర్ సూన్‌వూ క్వోన్‌తో ప్రపంచ 367వ ర్యాంకర్ దక్షిణేశ్వర్ సురేశ్ ఆడతాడు.
రెండో మ్యాచ్‌లో ప్రపంచ మాజీ 19వ ర్యాంకర్ హైన్ చుంగ్‌తో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ తలపడతాడు. 2018లో హైన్ చుంగ్ ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నిలో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)లను ఓడించి సెమీఫైనల్ చేరుకున్నాడు. రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)తో జరిగిన సెమీఫైనల్లో హైన్ చుంగ్ గాయంతో రెండో సెట్ మధ్యలో వైదొలిగాడు. శనివారం మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. మొదట డబుల్స్ మ్యాచ్, ఆ తర్వాత రెండు రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు.


