తిరుమల, 2026 సెప్టెంబరు 17: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన గురువారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు ముత్యపుపందిరి వాహనంపై తిరుమాడ వీధుల్లో వైభవంగా విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా వాహనసేవకు ముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తొమ్మిది రాష్ట్రాలకు చెందిన 21 కళాబృందాల్లోని 547 మంది కళాకారులు తమ రాష్ట్రాల సంప్రదాయ కళారూపాలు, నృత్య విన్యాసాలను ప్రదర్శిస్తూ తిరుమలలో సాంస్కృతిక వైభవాన్ని చాటారు.


