హైదరాబాద్: ఖైరతాబాద్‌లో కొలువుదీరిన 69 అడుగుల శ్రీ పంచముఖ సంకటహర మహా గణపతి తొలిపూజకు సిద్ధమయ్యాడు.
సోమవారం ఉదయం 11.30 గంటలకు జరిగే పూజలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.
కాగా..గణపతి దర్శనానికి వచ్చే భక్తుల కోసం పోలీసులు క్యూఆర్ కోడ్‌ను విడుదల చేశారు. దీన్ని స్కాన్ చేస్తే దర్శన మార్గాన్ని సూచిస్తుంది.


