breaking news
ticket less travel
-
టికెట్ చూపించమంటే బట్టలు చించేసుకుంది!
రైలు ప్రయాణంలో టికెట్ తనిఖీ సాధారణమే. టికెట్ లేకపోతే జరిమానా చెల్లించాలి.. లేదంటే నిబంధనల ప్రకారం చర్యలు ఎదుర్కోవాలి. కానీ ఓ మహిళ మాత్రం టికెట్ అడిగిన టికెట్ ఎగ్జామినర్‌తో వాగ్వాదానికి దిగి.. చివరకు తన దుస్తులనే చించేసుకుంది. అంతటితో ఆగకుండా ఆయనపై తీవ్ర ఆరోపణలు చేయడంతో అక్కడున్నవారంతా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వైరల్ అవుతున్న వీడియోలో రైలులో ప్రయాణిస్తున్న మహిళను యువతి చూపించమని టీటీఈ అడిగాడు. అయితే ఆమె వద్ద టికెట్ లేకపోవడంతో డ్రామాకు దిగింది. అదే సమయంలో తన సోదరుడు కూడా రైల్వేలో టీటీఈగా పని చేస్తాడని కబర్లు చెప్పింది. ఈ క్రమంలో వాళ్లిద్దరి మధ్య మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఫోన్లో మాట్లాడుతున్నట్లు చేస్తూ.. ఆ యువతి ఒక్కసారిగా తన దుస్తులను తానే చించుకోవడం ప్రారంభించింది. దీంతో అక్కడున్నవాళ్లంతా కంగుతిన్నారు. ఆపై టీటీఈ తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఫోన్లో రికార్డ్ చేయడంతో..అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని టీటీఈ తన ఫోన్లో రికార్డ్ చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఎలాంటి గొడవకు దిగకుండా ప్రశాంతంగా వ్యవహరించిన ఆయన.. అత్యవసర పరిస్థితి అనుకుంటే 112కు ఫోన్ చేయాలని మహిళకు సూచించినట్లు తెలుస్తోంది.ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో భిన్నమైన చర్చ మొదలైంది. ఘటనను రికార్డ్ చేయడం వల్ల టీటీఈపై తర్వాత ఎలాంటి ఆరోపణలు వచ్చినా అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఆధారం ఉంటుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. రైల్వే సిబ్బందికి బాడీ కెమెరాలు అందుబాటులో ఉంచితే ఇలాంటి వివాదాల్లో మరింత స్పష్టమైన ఆధారాలు ఉంటాయని కొందరు సూచిస్తున్నారు.రైల్వే సిబ్బందికి కొత్త సవాల్ప్రయాణికులతో నిత్యం నేరుగా వ్యవహరించే టీటీఈలు, ఇతర ఫ్రంట్‌లైన్ రైల్వే సిబ్బందికి ఇలాంటి వివాదాలు కొత్త సవాలుగా మారుతున్నాయి. టికెట్ తనిఖీల సమయంలో ప్రయాణికులు, సిబ్బంది మధ్య వాగ్వాదాలు చోటుచేసుకునే సందర్భాలు ఉంటాయి. అలాంటి సమయంలో ఇరువైపులా ఉన్న వారి ప్రవర్తనను రికార్డ్ చేసే వ్యవస్థ ఉంటే వాస్తవాన్ని నిర్ధారించడం సులభమవుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందనేదానిపై స్పష్టత లేదు. సోషల్‌మీడియాలో మాత్రం ట్రెండ్ అవుతోంది. అయితే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) జోక్యం చేసుకున్నట్లు సమాచారం. మహిళకు జరిమానా విధించినట్లు కూడా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి అధికారిక వివరాలు, కేసులో నమోదైన ఆరోపణలు తదితర అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.Woman tears off her clothes to accuse TT of molestation when he asked her to show ticketNeither Indian Police Nor Indian Judiciary knows how to handle such women Men in all such services should be provided bodycams to save themselves from false cases pic.twitter.com/ZoaV3HmBek— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) September 19, 2026ఇదీ చదవండి: రాజా సాబ్ వార్నింగ్ వీడియో వైరల్ -
‘వందేభారత్’లో టికెట్లేని ప్రయాణికులు.. స్పందించిన రైల్వే శాఖ
న్యూఢిల్లీ: భారత్ రైళ్లు ప్రవేశపెట్టినప్పటి నుంచి వాటిపై రాళ్లదాడులు జరగడం సర్వ సాధారణమైపోయింది. వందేభారత్‌కు సంబంధించి రోజూ ఏదో ఒక వార్త ఎక్కడో ఒక చోట చూస్తుంటాం. అయితే తాజాగా లక్నో-డెహ్రాడూన్ వందేభారత్ రైలులో టికెట్లేని ప్రయాణికులు చాలా మంది ఎక్కి టికెట్ ఉన్న ప్రయాణికులకు ఇబ్బందులు కలుగజేసిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.ప్రీమియం రైలులో ఈ పరిస్థితి తలెత్తితే మిగిలిన రైళ్ల పరిస్థితి ఏంటని వీడియో చూసిన నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో రైళ్ల సంఖ్యను పెంచడంతో పాటు బోగీలను కూడా పెంచాలని వారు రైల్వే శాఖను డిమాండ్ చేశారు.అయితే వందేభారత్ వీడియోపై రైల్వేశాఖ స్పందించింది. ఇది పాత వీడియో అని తెలిపింది. కొందరు రైతులు గతంలో బలవంతంగా రైలులోకి ఎక్కినపుడు తీసిన వీడియో అని వెల్లడించింది. ఇలాంటి పాత వీడియోలను మళ్లీ వైరల్ చేసి ప్రయాణికులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని కోరింది. -
రైల్వే చరిత్రలో రికార్డు..పెనాల్టీల రూపంలో రూ.9.62 కోట్లు..
సాక్షి, హైదరాబాద్: రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణించే వారి సంఖ్య ఏ స్థాయిలో ఉందో ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేవలం తొమ్మిది మంది రైల్వే తనిఖీ సిబ్బంది ఏకంగా రూ.9.62 కోట్లు వసూలు చేశారు. సగటున ఒక్కొక్కరూ రూ.కోటిని మించి వసూలు చేశారన్నమాట. టికెట్ లేకుండా ప్రయాణించేవారు, ముందస్తు బుకింగ్ లేకుండా సామగ్రి తరలించేవారిని గుర్తించి అపరాధ రుసుము వసూలు చేయటంలో తొమ్మిది మంది టికెట్ తనిఖీ సిబ్బంది చురుగ్గా వ్యవహరించి పెద్దమొత్తంలో పెనాలీ్టలు వసూలు చేశారు. ఇలా ఒక అధికారి రూ.కోటికిపైగా పెనాల్టీ వసూలు చేయటం రైల్వే చరిత్రలోనే తొలిసారి కావటం విశేషం. సికింద్రాబాద్ డివిజన్ నుంచి ఏడుగురు, గుంతకల్, విజయవాడ డివిజన్ల నుంచి ఒక్కొక్కరి చొప్పున ఈ ఘనత సాధించారు. సికింద్రాబాద్ డివిజన్‌కు చెందిన చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ నటరాజన్ 12,689 మంది ప్రయాణికుల నుంచి ఏకంగా రూ.9.16 కోట్లు వసూలు చేయటం విశేషం. చదవండి: టీఎస్పీఎస్సీ లీకేజ్ కేసులో తెరపైకి కొత్త పేరు.. స్నేహితుడికీ షేర్ చేశాడు! -
మాల్యాను తీసుకురండి.. అప్పుడు ఫైన్ కడతా!
ప్రజల్లో చైతన్యం, సామాజిక స్పృహ, జరుగుతున్న పరిణామాల పట్ల ఆగ్రహావేశాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో ఈ సంఘటన చూస్తే తెలుస్తుంది. ముంబైలో మంచి ఆర్థిక నేపథ్యం ఉన్న ఓ మహిళ.. కావాలనే టికెట్ తీసుకోకుండా రైలెక్కి, టికెట్ కలెక్టర్ ఫైన్ కట్టమని అడిగినప్పుడు.. ముందు విజయ్ మాల్యాను తీసుకొచ్చి అరెస్టు చేసి, అతడు బ్యాంకులకు అప్పున్న 9వేల కోట్లు కక్కించాలని, అప్పుడే తాను రూ. 260 ఫైన్ కడతానని పట్టుబట్టారు. చివరకు కావాలంటే తాను ఏడు రోజుల జైలు శిక్ష అయినా అనుభవిస్తాను గానీ, మాల్యాను అరెస్టు చేస్తే తప్ప ఫైన్ మాత్రం కట్టేది లేదని స్పష్టం చేశారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన ప్రేమలతా భన్సాలీ (44) దక్షిణ ముంబైలోని భులేశ్వర్ ప్రాంతంలో ఓ బహుళ అంతస్థుల భవనంలో ఉంటారు. ఆమె ముంబై సబర్బన్ రైల్లో టికెట్ లేకుండా ప్రయాణిస్తూ మహాలక్ష్మి రైల్వేస్టేషన్ వద్ద టికెట్ చెకింగ్ అధికారికి పట్టుబడ్డారు. టికెట్ లేనందుకు రూ.260 జరిమానా కట్టాలని అడిగితే, బ్యాంకులకు రూ. 9వేల కోట్ల అప్పున్న విజయ్ మాల్యాను అరెస్టు చేసి, ఆయనతో ఆ సొమ్ము కట్టించాలని.. అప్పుడు తాను జరిమానా కడతానని చెప్పారు. అలా ఒకటి, రెండు కాదు.. దాదాపు 12 గంటల పాలు రైల్వే అధికారులతో వాదిస్తూనే ఉన్నారు. విజయ్ మాల్యాను ఏమీ అనకుండా వదిలేసి, ఆయన వస్తానన్నప్పుడే రావాలంటూ సన్నాయినొక్కులు నొక్కుతున్న అధికారులు సామాన్యులను మాత్రం ఎందుకింత వేధిస్తున్నారని ప్రశ్నించారు. చివరకు ఆమె భర్త రమేష్ భన్సాలీని పిలిపించినా ఆయన కూడా ఈ విషయంలో తాను చేయగలిగింది ఏమీ లేదని.. అంతా ప్రేమలత ఇష్టమేనని స్పష్టం చేశారు. దాంతో ఏం చేయాలో తెలియక జుట్టుపట్టుకున్న రైల్వే పోలీసులు.. ఆమెను మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టారు. అక్కడ కూడా ఆమె జరిమానా మాత్రం కట్టనని, కావాలంటే జైలుకు వెళ్తానని చెప్పారు. ఈ విషయాన్ని పశ్చిమ రైల్వే సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ ఆనంద్ విజయ్ ఝా తెలిపారు.


