తల, కాళ్లు, చేతులు లేకుండా మహిళ మృతదేహం | Headless Woman Body Found In Vijayawada Canal, Police Suspect Murder And Launch Probe | Sakshi
Sakshi News home page

తల, కాళ్లు, చేతులు లేకుండా మహిళ మృతదేహం

Sep 19 2026 11:09 AM | Updated on Sep 19 2026 11:40 AM

DeadBodyFound Woman Suspicious Death In NTR

విజయవాడ : ఎన్టీటీపీఎస్‌ చన్నీటి కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని ఇబ్రహీంపట్నం పోలీసులు శుక్రవారం రాత్రి స్వా«దీనం చేసుకున్నారు. సంస్థ స్టేజ్‌ –2 వద్ద మహిళ మృతదేహాన్ని గుర్తించిన అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని బయటకు తీయగా, మహిళకు తల, చేతులు, కాళ్లు లేనట్లు గమనించారు. 

 సుమారు 30–40 ఏళ్ల మధ్య వయస్సు మహిళగా గుర్తించారు. ఆమె శరీరంపై ఉన్న  బ్లూ కలర్‌ టాప్, బ్లాక్‌ కలర్‌ బ్రా, వైట్‌ కలర్‌ లెగ్గింగ్‌ దుస్తులను స్వా«దీనం చేసుకున్నారు. ఎవరో హత్య చేసి ఎన్టీటీపీఎస్‌ కాలువలో మృతదేహాన్ని పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనే విచారణ చేపట్టారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతదేహం ఆచూకీ తెలిసిన వారు 94406 27084 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సీఐ సుబ్రహ్మణ్యం కోరారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement