క్లుప్తంగా
సాగు ప్రశ్నార్థకం..
ఏడాదిగా జమ లేదు..
అయితే స్థానిక సంస్థల్లో ఎక్కువగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతినిధులు ఉండటంతో స్టాంప్ డ్యూటీపై రాష్ట్ర ప్రభుత్వం దెబ్బకొంటిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయా స్థానిక సంస్థలకు రిజిస్ట్రేషన్ శాఖ ప్రతి ఆర్థిక సంవత్సరంలో స్టాంపు డ్యూటీ విడుదల చేయాల్సి ఉంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి స్థానిక సంస్థలకు స్టాంప్ డ్యూటీ విడుదల చేయటం లేదు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో జిల్లా పరిషత్ పాలకవర్గం స్టాంప్ డ్యూటీపై పలు సమావేశాల్లో అధికారులను నిలదీయటంతో రూ.23.03కోట్లు జమ అయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా స్టాంప్ డ్యూటీగా జిల్లా పరిషత్‌కు జమ కాలేదు. ఫలితంగా జిల్లాలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టలేని పరిస్థితి ఎదురవుతోంది. ఎస్సీ, ఎస్టీ, సీ్త్ర, శిశు సంక్షేమశాఖలకు ఇవ్వాల్సిన బడ్జెట్‌లోనూ కోత పడుతోంది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పరిషత్ నిధులపై వివక్షకు పాల్పడితే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని పాలకవర్గ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల షెడ్యూల్ ఇలా...
శనివారం శ్రీ 19 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ ఈ నెల 21న నిర్వహించే శాంతిర్యాలీని విజయవంతం చేద్దామని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విజయవాడలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులతో ఆయన సమావేశమయ్యారు. ఆ సమావేశంలో జిల్లాలో అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అంతేకాకుండా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 21న నగరంలోని శిఖామణిసెంటర్ నుంచి శాప్ కార్యాలయం వరకూ నిర్వహించనున్న శాంతియుత ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేసేలా ప్రతి అనుబంధ విభాగం అధ్యక్షులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రముఖ మానసిక వైద్యుడు ఇండ్ల రామసుబ్బారెడ్డి బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (నిమ్‌హాన్స్) నుంచి అరుదైన సత్కారం పొందారు. నిమ్‌హాన్స్‌లో సైకియాట్రీ పీజీ కోర్సును ప్రారంభించి 71ఏళ్లు పూర్తయిన సందర్భంగా మొదటిసారిగా ఫౌండేషన్ దినోత్సవం ఈనెల 17న నిర్వహించారు. ఈ సందర్భంగా నిమ్ హాన్స్‌లో పీజీ చేసి, వైద్య పరంగానే కాకుండా, పలు రంగాల్లో విశేష కృషి చేస్తున్న ఒక పూర్వ విద్యార్థిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి సత్కరించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఈ సత్కారం పొందేందుకు డాక్టర్ ఇండ్లను ఆహ్వానించగా, ఆ సభలో ‘ప్రొఫెషన్/ప్యాషన్’(వృత్తి/ప్రవృత్తి) అంశంపై ప్రసంగించినట్టు డాక్టర్ ఇండ్ల శుక్రవారం తెలిపారు. తాను 1977 నుంచి 82 వరకూ నిమ్‌హాన్స్‌లో పీజీ, డీపీఎం డిగ్రీలు చేసిన అనంతరం కొంతకాలం వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కళాశాలలో, పుదుచ్చేరిలోని జిప్‌మర్‌లోనూ సైకియాట్రిస్టుగా సేవలు అందించినట్టు పేర్కొన్నారు. అనంతరం విజయవాడలో ఆస్పత్రిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సత్కారం పొందడం సంతోషంగా ఉందని ఆయన వివరించారు.
● పునరుద్ధరణ కోసం ప్రతిపాదనలంటూ
ఏడాదిన్నరగా డ్రామాలు
● కుడి కాలువపై నాలుగు పంపుహౌస్‌లలో
12మోటార్లు షట్‌డౌన్
● పూర్తిగా మూతబడిన చివరి
రెండు పంపుహౌస్‌లు
● రెండు మోటార్లతోనే ఆయకట్టుకు
నీళ్లిస్తున్నామంటూ కవర్ చేస్తున్న
అధికారులు
● మేలుకోకపోతే 4,820ఎకరాల
ఆయకట్టుపై తీవ్ర ప్రభావం
జి.కొండూరు: మైలవరం నియోజకవర్గానికి జీవనాడిగా ఉన్న తారకరామ ఎత్తిపోతల పథకాన్ని రెండేళ్లుగా మరుగున పెట్టిన ప్రజా ప్రతినిధులు, చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తానంటూ ప్రగల్భాలు పలకడం హాస్యాస్పదంగా ఉంది. ఎత్తిపోతల పథకంలో మోటార్లు పని చేయకపోయినా ఆయకట్టు రైతులకు పుష్కలంగా నీరందిస్తున్నట్లు అధికారులు ఆడుతున్న కవరింగ్ డ్రామాలు రైతులను మరింత ఆందోళనలో పడేస్తోంది. ఏడాది మొత్తం నీరు అందుబాటులో ఉండి కూడా ఎత్తిపోయలేకపోవడంతో ఆయకట్టు రైతాంగం నరకయాతన పడుతున్నారు. తారకరామ ఎత్తిపోతల పథకంలో కుడి కాలువపై ఉన్న నాలుగు పంపుహౌస్‌లలో రెండు పంపుహౌస్‌లు పూర్తిగా మూతపడగా రెండు పంపుహౌస్‌లలో ఉన్న ఎనిమిది మోటార్లలో ఆరు మోటార్లు పనిచేయకపోవడమే పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.
● కొండపల్లి శాంతినగర్ సమీపంలో ఉన్న తారకరామ ఎత్తిపోతల పథకం మొదటి పంప్‌హౌస్ పరిధిలో ఆయకట్టు సాగు భూమి 850ఎకరాలు ఉంది. అయితే మొదటి పంపుహౌస్‌లో 120హెచ్‌పీ కెపాసిటీ ఉన్న నాలుగు మోటార్లు ఉండగా, మూడు మోటార్లు పనిచేయకపోవడంతో తొలగించారు. ఒక్క మోటారు మాత్రమే పని చేయడంతో 57.84క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయాల్సి ఉండగా, కేవలం 14.46క్యూసెక్కుల నీటిని మాత్రమే ఎత్తిపోస్తోంది.
● కట్టుబడిపాలెం సమీపంలో గల రెండో పంపుహౌస్ పరిధిలో ఆయకట్టు సాగుభూమి 980ఎకరాలుగా ఉంది. ఈ పంపుహౌస్‌లో 120హెచ్‌పీ కెపాసిటీ ఉన్న నాలుగు మోటార్లు ఉన్నప్పటికీ ఒక్క మోటారు మాత్రమే పనిచేయడంతో ఇక్కడ కూడా 14.46క్యూసెక్కుల నీటిని మాత్రమే ఎత్తిపోస్తోంది. ఒకటి, రెండు పంపుహౌస్‌లలో ఒక్కొక్క మోటారు మాత్రమే పనిచేస్తుండటంతో 115.68క్యూసెక్కుల నీటికి గానూ 28.92క్యూసెక్కుల నీటినే ఎత్తిపోయడం వల్ల ఈ రెండు పంపుహౌస్‌ల పరిధిలో ఉన్న 1,830ఎకరాలకు అంతంతమాత్రంగానే నీరందుతోంది. అంతే కాకుండా ఈ నీరు ఫోర్స్ లేకపోవడంతో మూడో పంపుహౌస్ వద్దకు కూడా రావడం లేదు.
● ఇక పినపాక గ్రామం సమీపంలో గల మూడో పంపుహౌస్ పరిధిలో ఆయకట్టు 1,123ఎకరాలు ఉంది. ఈ పంపుహౌస్‌లో 120హెచ్‌పీ కెపాసిటీ ఉన్న మూడు మోటార్లు ఉండగా ఒక్కటి కూడా పనిచేయక 38.56క్యూసెక్కుల నీటి ఎత్తిపోతకు బ్రేక్ పడింది.
● జి.కొండూరు సమీపంలో గల నాల్గో పంప్‌హౌస్ కింద ఆయకట్టు 1,867ఎకరాలు ఉంది. ఈ పంపుహౌస్‌లో 75హెచ్‌పీ కెపాసిటీ మోటార్లు మూడు ఉండగా ఒక్కటి కూడా పనిచేయకపోవడంతో 30.36 క్యూసెక్కుల నీటి ఎత్తిపోతకు బ్రేక్ పడింది.
తారకరామ ఎత్తిపోతల పథకం నిర్వహణను స్థానిక ప్రజా ప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు రెండేళ్లుగా గాలికొదిలేశారు. తారకరామ కుడి కాలువపై ఉన్న నాలుగు పంపుహౌస్‌లలో మోటార్లు పని చేయక ఆయకట్టు రైతాంగం నరకయాతన పడుతుంటే పునరుద్ధరణ కోసం రూ.3.56కోట్లతో ప్రతిపాదనలు పంపామంటూ రెండేళ్లుగా అధికారులు ఒకటే పాటపాడటం పట్ల అనుమానాలు తలెత్తుతున్నాయి. 9.25కిలోమీటర్ల మేర ఉన్న తారకరామ కుడి కాలువలో ఇటీవల రూ.8లక్షల వెచ్చించి పూడిక తీత పనులు పూర్తి చేశారు. అయినప్పటికీ కాలువ పొడవునా ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలు, తుమ్మ, జమ్ము, తూడు, మొదలైన వాటితో నిండిపోయి కాలువలో నీరు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. ట్రాన్స్ ఫార్మర్లు సక్రమంగా లేక విద్యుత్ సరఫరా అంతంతమాత్రంగానే ఉంది. ఓవరాల్‌గా ఈ ఎత్తిపోతల పథకం కేవలం రాజకీయాలకు కేంద్రబిందువుగా మారింది తప్ప రైతులకు సాగునీటిని అందించడంలో వెనకబడింది.
తారకరామ కుడికాలువపై మోటార్లు పనిచేయక
మూతబడిన మూడో పంపుహౌస్ ఇది
కుడికాలువను
కమ్మేసిన తూడుకాడ
ఇలా జరగాలి..
చివరి ఈ రెండు పంపుహౌస్‌లలో మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు పనిచేయకపోవడంతో మొత్తానికి మూతబడ్డాయి. ఈ రెండు పంపుహౌస్‌ల పరిధిలో ఉన్న 2,990ఎకరాల సాగుభూమి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ఈ రెండు పంపుహౌస్‌ల పరిధిలో పత్తి, మిరప, కూరగాయలు, పండ్లతోటల వంటివి రైతులు సాగు చేశారు. ఇప్పటికే పైర్లు నీటి ఎద్దడికి గురవుతున్న నేపథ్యంలో అధికారులు నిర్లక్ష్యం వీడకపోతే అవి పూర్తిగా ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఏడాది పొడవునా నీళ్లు అందుబాటులో ఉండి కూడా ఎత్తిపోయలేకపోవడంతో ఈ నాలుగు పంపుహౌస్‌ల పరిధిలో రబీ సాగును రైతులు పూర్తిగా మరిచిపోయారు.


