తండ్రి మందలించాడని.. విద్యార్థి ఆత్మహత్య | 17 Year Old ITI Student Ends His Life In Karimnagar After Scolding Over College Attendance | Sakshi
Sakshi News home page

తండ్రి మందలించాడని.. విద్యార్థి ఆత్మహత్య

Sep 19 2026 9:10 AM | Updated on Sep 19 2026 9:49 AM

Karimnagar 17 Year Old Student Dies Incident Telangana

తెలంగాణ: కాలేజీకి వెళ్లడం లేదని తండ్రి మందలించడంతో కొడుకు ఉరేసుకొని మృతిచెందిన ఘటన శుక్రవారం కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం ఆకునూర్‌ గ్రామంలో జరిగింది. ఆకునూర్‌కు చెందిన ఒజ్జ ఉప్పలయ్య సింగరేణి విశ్రాంత ఉద్యోగి. ఉప్పలయ్య మొదటి భార్యకు ఐదుగురు సంతానం.

ఆమె చనిపోగా ఉమను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు కుమారుడు ఒజ్జ హర్షవర్ధన్‌ (17). హుజూరాబాద్‌లో ఐటీఐ చదువుతున్నాడు. ఈనేపథ్యంలో కాలేజీకి సరిగా వెళ్లడం లేదని తండ్రి ఉప్పలయ్య మందలించాడు. దీంతో హర్షవర్ధన్‌ ఇంట్లో ఉరేసుకున్నాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

గమనిక: మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001; మెయిల్: roshnihelp@gmail.com

ఇదీ చదవండి: శంషాబాద్‌: గణేశ్‌ నిమజ్జనం కోసం వెళ్లి వస్తుండగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement