మను బాకర్‌కు నిరాశ.. షూటింగ్‌లో భారత్‌కు డబుల్‌ బ్రాంజ్‌ | Asian Games 2026 Day 4: Double Delight In Skeet, Anantjeet Singh Naruka, Mairaj Khan, Bhavtegh Singh Gill captured bronze medal | Sakshi
Sakshi News home page

Asian Games 2026: మను బాకర్‌కు నిరాశ.. షూటింగ్‌లో భారత్‌కు డబుల్‌ బ్రాంజ్‌

Sep 23 2026 10:28 AM | Updated on Sep 23 2026 10:51 AM

Asian Games 2026 Day 4: Double Delight In Skeet, Anantjeet Singh Naruka, Mairaj Khan, Bhavtegh Singh Gill captured bronze medal

source: X

2026 ఆసియా క్రీడల నాలుగో రోజు భారత షూటర్లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. స్వర్ణం ఖాయమనుకున్న స్టార్‌ షూటర్‌ మనూ బాకర్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో కనీసం కాంస్య కూడా సాధించలేకపోగా.. స్కీట్‌ ఈవెంట్‌లో మహిళలు, పురుషుల జట్లు కాంస్య పతకాలు సాధించాయి.  

తొలుత మహిళల స్కీట్‌ టీమ్‌ ఈవెంట్‌లో రైజా ధిల్లాన్, మహేశ్వరి చౌహాన్, పరినాజ్ ధలివాల్‌తో కూడిన భారత జట్టు.. ఆతర్వాత పురుషుల స్కీట్‌ టీమ్‌ అనంత్‌జీత్‌ సింగ్‌ నరూకా, మైరాజ్‌ ఖాన్‌, భవ్‌తేజ్‌ సింగ్‌ గిల్‌తో కూడిన భారత జట్టు కాంస్య పతకాలు సొంతం చేసుకున్నాయి. అనంత్‌జీత్‌ సింగ్‌ వ్యక్తిగత విభాగంలోనూ ఫైనల్‌కు అర్హత సాధించాడు.

సాఫ్ట్‌ టెన్నిస్‌లో చరిత్ర.. జయ్‌ మీనాకు పతకం ఖాయం
పురుషుల సాఫ్ట్‌ టెన్నిస్‌ సింగిల్స్‌లో భారత ఆటగాడు జయ్‌ మీనా సెమీఫైనల్‌కు చేరుకుని చరిత్ర సృష్టించాడు. ఈ విజయంతో ఆసియా గేమ్స్‌ చరిత్రలో సాఫ్ట్‌ టెన్నిస్‌లో భారత్‌కు తొలి పతకం ఖాయమైంది.

మహిళల కబడ్డీలో భారత్‌ ఘన విజయం
మహిళల కబడ్డీలో భారత జట్టు అదరగొట్టింది. గ్రూప్‌-ఎ మ్యాచ్‌లో ఇరాన్‌ను 37-23తో ఓడించింది. మరోవైపు, వెయిట్‌లిఫ్టింగ్‌ మహిళల 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను పతకంపై ఆశలు పెట్టుకుంది. ఆసియా గేమ్స్‌లో తన తొలి పతకం సాధించడమే లక్ష్యంగా ఆమె బరిలోకి దిగనుంది.

ఇదీ చదవండి: టీమిండియా క్రికెటర్‌కు తమిళనాడు సీఎం విజయ్‌ భారీ నజరానా


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement