సెంచరీతో కదంతొక్కిన ఆసీస్‌ ప్లేయర్‌.. టీమిండియా టార్గెట్‌ ఎంతంటే..? | India A restricted Australia A for 274 runs in 1st Unofficial ODI | Sakshi
Sakshi News home page

సెంచరీతో కదంతొక్కిన ఆసీస్‌ ప్లేయర్‌.. టీమిండియా టార్గెట్‌ ఎంతంటే..?

Oct 6 2026 5:58 PM | Updated on Oct 6 2026 6:04 PM

India A restricted Australia A for 274 runs in 1st Unofficial ODI

source: X

పుదుచ్చేరి వేదికగా భారత్‌-ఏ, ఆస్ట్రేలియా-ఏ జట్ల మధ్య ఇవాళ తొలి అనధికారిక వన్డే మ్యాచ్‌ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 48.2 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌటైంది.

నాలుగో నంబర్‌ ఆటగాడు నాథన్‌ మెక్‌స్వీని (123) సెంచరీతో కదంతొక్కగా.. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్‌ విల్‌ సదర్‌ల్యాండ్‌ (77) అర్ద సెంచరీతో రాణించాడు. వీరు మినహా ఆసీస్‌ జట్టులో ఒక్కరు కూడా రాణించలేదు. మిచెల్‌ ఓవెన్‌ 10, సామ్‌ కొన్‌స్టాస్‌ 14, జోస్‌ ఫిలిప్‌ 2, లియామ్‌ స్కాట్‌ 15, నిఖిల్‌ చౌదరి 6, టాడ్‌ మర్ఫీ 3, స్పెన్సర్‌ జాన్సన్‌ 0, బియర్డ్‌మన్‌ 1, మెరిడిత్‌ 11 (నాటౌట్‌) పరుగులు చేశారు.

భారత బౌలర్లలో సూర్యాంశ్‌ షేడ్గే 4, యశ్‌ ఠాకూర్‌ 3, అర్షద్‌ ఖాన్‌ 2, నిషాంత్‌ సంధు ఓ వికెట్‌తో సత్తా చాటారు.

కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలుత జరిగిన టెస్ట్‌ సిరీస్‌ను భారత్‌ 1-0తో గెలుచుకుంది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌ నెగ్గిన భారత్‌.. రెండో టెస్ట్‌ను డ్రా చేసుకుంది. వన్డే సిరీస్‌లోని రెండు, మూడు వన్డేలు అక్టోబర్‌ 9, 11 తేదీల్లో పుదుచ్చేరి వేదికగానే జరుగనున్నాయి. 

ఇదీ చదవండి: జడేజా కంటే అక్షర్‌ బెటర్‌.. అశ్విన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement