పుదుచ్చేరి వేదికగా ఆస్ట్రేలియా-ఎతో జరుగుతున్న రెండో అనధికారిక వన్డేలో భారత్-ఎ జట్టు బ్యాటర్లు రాణించారు. సూర్యాన్ష్ షెడ్గే 66 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. విప్రజ్ నిగమ్(40), ప్రియాన్ష్ ఆర్య(49), ప్రభ్‌సిమ్రాన్ సింగ్(39), రుతురాజ్ గైక్వాడ్(33) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.
ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 47.3 ఓవర్లలో 275 పరుగులు చేసి ఆలౌటైంది. గత మ్యాచ్‌లో అదరగొట్టిన రజిత్ పాటిదార్(5) ఈ మ్యాచ్‌లో మాత్రం విఫలమయ్యాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్ డ్వార్షుయిస్, విల్ సదర్లాండ్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. లైమ్ స్కాట్ రెండు, ఓవెన్ ఓ వికెట్ సాధించారు. కాగా ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో ఆసీస్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిస్తే సిరీస్‌ను కంగారులు క్లీన్ స్వీప్ చేస్తారు.
తుది జట్లు
ఆస్ట్రేలియా-ఎ: మిచెల్ ఓవెన్, లియామ్ స్కాట్, జోష్ ఫిలిప్, లాచ్‌లాన్ షా(వికెట్ కీపర్), నాథన్ మెక్‌స్వీనీ, నిఖిల్ చౌదరి, విల్ సదర్లాండ్, బెన్ ద్వార్షుయిస్, తన్వీర్ సంఘా, టాడ్ మర్ఫీ(కెప్టెన్), మహ్లీ బార్డ్‌మన్
ఇండియా-ఎ: ప్రభ్‌సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), ప్రియాంష్ ఆర్య, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), రజత్ పాటిదార్, నిశాంత్ సింధు, సూర్యాంశ్ షెడ్గే, విప్రజ్ నిగమ్, అనుకూల్ రాయ్, యశ్ ఠాకూర్, గుర్జప్నీత్ సింగ్


