అందుకే 'స్కై'ను ఎంపిక చేయలేదు.. ఎంసీఏ వర్గాల వివరణ | MCA Reveals Reason Behind Suryakumar Yadav Snub From Mumbai Squad | Sakshi
Sakshi News home page

అందుకే 'స్కై'ను ఎంపిక చేయలేదు.. ఎంసీఏ వర్గాల వివరణ

Oct 6 2026 4:50 PM | Updated on Oct 6 2026 4:56 PM

MCA Reveals Reason Behind Suryakumar Yadav Snub From Mumbai Squad

source: X

2026-27 రంజీ ట్రోఫీ సీజన్ కోసం ముంబై జట్టును ఇవాళ ప్రకటించారు. అయితే ఈ జట్టులో స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ పేరు లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా తాను రంజీ ట్రోఫీకి అందుబాటులో ఉంటానని సూర్యకుమార్ స్వయంగా చెప్పిన తర్వాత కూడా అతడిని ఎంపిక చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.

సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ అధికారి ఒకరు స్పందించారు. రంజీ ట్రోఫీలో ఆడేందుకు సూర్యకుమార్ యాదవ్‌ను తాము సంప్రదించినప్పటికీ, అతడి నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని, అంతేకాకుండా ప్రీ-సీజన్ శిక్షణ శిబిరానికి కూడా అతను హాజరుకాలేదని తెలిపారు.

సదరు అధికారి వివరణ ఇలా ఉంటే, బయట ప్రచారం మాత్రం వేరేలా జరుగుతుంది. సూర్యకుమార్‌ యాదవ్‌ రంజీ ట్రోఫీ ఆడాలని అనుకున్నా, ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ అతన్ని ఎంపిక చేయలేదని క్రికెట్‌ ఫాలోవర్స్‌ అనుకుంటున్నారు. ఈ అంశంపై సూర్య స్వయంగా నోరు విప్పితే కాని అసలు విషయం బయటపడదు.

ఇదిలా ఉంటే, ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ సూర్యకుమార్‌ను రంజీ జట్టుకు ఎంపిక చేయకపోయినా, వైట్ బాల్ క్రికెట్‌లో ఆడించే అవకాశం ఉంది. రాబోయే వన్డే, టీ20 దేశవాళీ టోర్నీల కోసం అతడు జట్టులో భాగంగా ఉంటాడని తెలుస్తోంది.

36 ఏళ్ల సూర్యకుమార్‌ దేశవాలీ క్రికెట్‌లో సత్తా చాటి తిరిగి టీమిండియా తలుపులు తట్టాలని భావిస్తున్నాడు. 2026 టీ20 ప్రపంచకప్‌ గెలిపించిన తర్వాత అతడు భారత జట్టు నుంచి కనుమరుగయ్యాడు.

ఇదీ చదవండి: ముంబై జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. సూర్య‌కుమార్‌కు షాక్‌!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement