సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా, దేవళాయ్ ప్రాంతంలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఖవ్డా కొండపైకి వెళ్లిన 18 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం, అతడిని కాపాడేందుకు వెళ్లి తల్లిదండ్రులతో సహా ముగ్గురూ కొండపై నుంచి కిందపడి మరణించడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతి రేపింది.
దాదాపు మూడు గంటలు పాటు సాగిన ఈ వ్యవహారం చివరికి విషాదాంతమైంది. శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో యువకుడు ఖవ్డా కొండ అంచున నిలబడి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం ప్రారంభించాడో యువకుడు. దాదాపు 3 గంటల పాటు అతడి తల్లి, స్థానిక గ్రామస్తులు, పోలీసులు అతడిని కిందకు దిగిరావాలని ఎంత బ్రతిమిలాడినా ఫలితం లేకపోయింది.
దీంతో ఆందోళనకులోనైన తండ్రి మధ్యాహ్నం 1 గంట సమయంలో, కొండ ఎక్కి కొడుకును కాపాడేందుకు ప్రయత్నించాడు. కొడుకును పట్టుకునే క్రమంలో ఇద్దరూ అదుపుతప్పి కొండపై నుంచి కిందకు పడిపోయారు. కళ్లముందే భర్త, కొడుకు కిందపడిపోవడం చూసి భయాందోళనకు గురైన తల్లి కూడా కొద్దిక్షణాల్లోనే కొండపై నుంచి దూకేసింది. తీవ్ర గాయాలతో ముగ్గురూ అక్కడికక్కడే మరణించారు.
ఇదీ చదవండి: మహిళతో వివాదంలో గ్యాంగ్ వార్ : ఒకరి దారుణ హత్య
ఈ ఉదంతాన్ని అక్కడున్న పర్యాటకులు, స్థానికులు ఫోన్లలో వీడియో తీశారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: 14 ఏళ్లకే సోషల్ మీడియాలో సంచలనం ఎవరీ ‘ఏలియన్ స్టార్’


