నెల్లూరు చిత్రకు జీవిత ఖైదు.. ప్రియుడికీ అదే శిక్ష! | Nellore Wife And Husband Incident | Sakshi
Sakshi News home page

నెల్లూరు చిత్రకు జీవిత ఖైదు.. ప్రియుడికీ అదే శిక్ష!

Oct 6 2026 1:34 PM | Updated on Oct 6 2026 2:16 PM

Nellore Wife And Husband Incident

తిరుపతి: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన కేసులో భార్య నెల్లూరు చిత్ర, ఆమె ప్రియుడు తొండా కృష్ణమూర్తికి గూడూరు 7వ ఏడీజే కోర్టు న్యాయమూర్తి వెంకటనాగపవన్‌ జీవిత ఖైదుతో పాటుగా రూ.15 వేలు జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు ఇచ్చినట్టు స్థానిక సీఐ ఎం.మురళీకృష్ణ తెలిపారు.  సీఐ కథనం.. సూళ్లూరుపేట పట్టణంలోని గణపతినగర్‌కి చెందిన నెల్లూరు చిత్ర(26), జగదీష్‌కు పెద్దలు నిశ్చయించి వివాహం జరిపించారు.

ఈ క్రమంలో తడ మండలం, పాములమిట్ట గ్రామానికి చెందిన తొండా కృష్ణమూర్తి (25)తో చిత్రకు ఏర్పడిన పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. వీరిద్దరి అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని  భావించి 2023 అక్టోబర్‌ 14వ తేదీ రాత్రి ప్రియుడు కృష్ణమూర్తికి ఫోన్‌ చేసి తన భర్తను చంపేయాలని కోరింది. కృష్ణమూర్తి అదే రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో మోటార్‌ సైకిల్‌పై జగదీష్‌ను ఎక్కించుకుని మన్నారుపోలూరు క్రాస్‌ రోడ్డు సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి మద్యం సేవించారు.

 జగదీష్‌కు మరింత ఎక్కువగా తాగించి బాగా మైకమెక్కాక పదునైన బ్లేడ్‌తో గొంతుకోసి పారిపోయాడు. జగదీష్‌ తీవ్రమైన రక్తస్రావంతో నడుచుకుంటూ వచ్చి జాతీయ రహదారి డివైడర్‌ మీద పడి చనిపోయాడు. అప్పటి సూళ్లూరుపేట ఇన్‌చార్జి సీఐ సోమయ్య దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్‌ చేశారు. ఆ తరువాత మరో సీఐ మధుబాబు తదుపరి దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జిషీటు దాఖలా చేశారు. నేరం రుజువు కావడంతో ముద్దాయిలు నెల్లూరు చిత్ర, ఆమె ప్రియుడు తొండా కృష్ణమూర్తికి జీవితఖైదుతో పాటు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement