మృతదేహాన్ని కూడా వదల్లేదు.. మర్మాంగంపై కత్తెరతో.. | Palnadu Murder Case Incident | Sakshi
Sakshi News home page

మృతదేహాన్ని కూడా వదల్లేదు.. మర్మాంగంపై కత్తెరతో..

Oct 6 2026 12:07 PM | Updated on Oct 6 2026 12:53 PM

Palnadu Murder Case Incident

పల్నాడు : ఒక హత్య కేసు దర్యాప్తు ఎనిమిదేళ్ల క్రితం జరిగిన మరో హత్య కేసు మిస్టరీని ఛేదించింది. పట్టణంలో ఇటీవల సంచలనం సృష్టించిన హత్య కేసులో నిందితుడిని అరెస్ట్‌ చేసి విచారించగా.. మరో పాత హత్య కేసు వెలుగులోకి వచ్చింది. హత్య చేసి వారి శరీర భాగాలను కత్తిరిస్తే బలం వస్తుందన్న వికృత ఆలోచనలతో నిందితుడు నేరాలకు పాల్పడుతున్నట్లు పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్‌ అదహళ్లి తెలిపారు. 

సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు.. గత నెల 29వ తేదీ కాసు బ్రహ్మానందరెడ్డి కాంప్లెక్స్‌ ఆవరణలో నిద్రిస్తున్న గాసి రాజేష్‌(35) హత్య జరగడం.. కత్తెరతో మృతుడి మర్మాంగంపై ఉన్న చర్మం కత్తిరించబడడం తెలిసిందే. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సమీపంలో లభ్యమైన సీసీ కెమెరా పుటేజ్‌ ఆధారంగా నిందితుడు బరంపేటకు చెందిన కసుపర్తి నిఖిల్‌గా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.   

ఎనిమిదేళ్ల నాటి హత్య కేసు ఛేదన.. 
ప్రస్తుత హత్యతో పాటు మరో హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 2018 జనవరి నెలలో కోట సెంటర్‌లో నిద్రిస్తున్న నాగరాజు అనే వ్యక్తిని బండరాయితో కొట్టి హత్య చేసి అతని ఎడమచేతి మధ్యవేలును కత్తిరించుకొని వెళ్లినట్లు నిందితుడు నేరాన్ని అంగీకరించాడని ఎస్పీ తెలిపారు. ఇతరులను హత్యచేసి వారి శరీరా భాగాలను కత్తిరిస్తే తనకు బలం, శక్తులు వస్తాయని పదేపదే కలలు వచ్చేవని నిందితుడు విచారణలో వెల్లడించినట్లు ఎస్పీ తెలిపారు.

 ఈ కారణంతో ఒంటరిగా నిద్రిస్తున్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని హత్యలు చేస్తున్నట్లు నిందితుడు తెలిపాడన్నారు. హత్యకు ఉపయోగించిన కత్తులను, హత్య సమయంలో నిందితుడు ధరించిన రక్తపు మరకలు కలిగిన దుస్తువులను అతని నుంచి స్వా«దీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఒక హత్య కేసు దర్యాప్తులో 8 ఏళ్ల నాటి హత్య కేసును వెలుగులోకి తీసుకురావటంలో కీలకంగా వ్యవహరించిన నరసరావుపేట డీఎస్పీ ఎం.హనుమంతరావు, వన్‌టౌన్‌ సీఐ షేక్‌ ఫిరోజ్, ఎస్‌ఐ వంశీ కృష్ణలను ప్రత్యేకంగా అభినందించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement