కాల్‌ తీయగానే న్యూడ్‌ వీడియో.. ఖాతాలో 50 లక్షలు మాయం! | Call was Received Youth cheated of 50 lakh by Threatening to make it Viral | Sakshi
Sakshi News home page

కాల్‌ తీయగానే న్యూడ్‌ వీడియో.. ఖాతాలో 50 లక్షలు మాయం!

Oct 6 2026 9:48 AM | Updated on Oct 6 2026 10:33 AM

Call was Received Youth cheated of 50 lakh by Threatening to make it Viral

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 26 ఏళ్ల యువకుడు భారీ సైబర్ మోసానికి బలయ్యాడు. గుర్తుతెలియని నంబర్ నుంచి వచ్చిన వీడియో కాల్‌ను స్వీకరించిన వెంటనే అతడి వీడియోను రికార్డు చేసిన సైబర్ నేరగాళ్లు.. దాన్ని వైరల్ చేస్తామని బెదిరించారు. అనంతరం తమను ఢిల్లీ సైబర్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు, యూట్యూబ్ అధికారులు అంటూ పరిచయం చేసుకుని అరెస్టు చేస్తామని భయపెట్టారు. ఈ క్రమంలో బాధితుడి నుంచి మొత్తం రూ.49.78 లక్షలు ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నారు.

అహ్మదాబాద్‌కు చెందిన 26 ఏళ్ల యువకుడికి గుర్తుతెలియని నంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. కాల్‌లో న్యూడ్‌ దృశ్యాలు కనిపించడంతో  వెంటనే కాల్ కట్ చేసి, ఆ నంబర్‌ను బ్లాక్ చేశాడు. అయితే అప్పటికే సైబర్ నేరగాళ్లు ఆ కాల్‌ను రికార్డు చేశారు. ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తామని నిందితులు యువకుడిని బెదిరించారు. వీడియో బయటకు వస్తే తన వ్యక్తిగత జీవితం దెబ్బతింటుందని భయపెట్టి డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు.

ఇంతటితో ఆగని నిందితులు తమను ఢిల్లీ సైబర్ క్రైమ్ బ్రాంచ్ అధికారులుగా పరిచయం చేసుకున్నారు. యువకుడిపై కేసు నమోదైందని, అరెస్టు తప్పదని చెప్పినట్లు సమాచారం. దీంతో బాధితుడిలో భయం మరింత పెరిగింది. ఆ తర్వాత మరికొందరు వ్యక్తులు తాము యూట్యూబ్ అధికారులమని పరిచయం చేసుకుని యువకుడిని సంప్రదించారు. వీడియోను తొలగించేందుకు, సమస్యను పరిష్కరించేందుకు డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. నిందితుల బెదిరింపులు, మోసపూరిత మాటలకు భయపడిన యువకుడు విడతలవారీగా మొత్తం రూ.49.78 లక్షలు ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. తరువాత ఈ  ఘటనపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి సైబర్ నేరగాళ్లను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదీ చదవండి: సీఈసీ దిష్టిబొమ్మ దహనం.. 9 మందిపై ఎఫ్‌ఐఆర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement