ఏపీపీఎస్సీలో ‘రిడ్రెస్సెల్‌ సెల్‌’ | APPSC sets up a dedicated call centre with six phone numbers | Sakshi
Sakshi News home page

ఏపీపీఎస్సీలో ‘రిడ్రెస్సెల్‌ సెల్‌’

Nov 12 2026 5:50 AM | Updated on Nov 12 2026 5:50 AM

APPSC sets up a dedicated call centre with six phone numbers

ఆరు ఫోన్‌ నంబర్లతో ప్రత్యేక కాల్‌ సెంటర్‌ ఏర్పాటు

ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సేవలు

సాక్షి, అమరావతి: ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లపై దరఖాస్తుదారులు చేసే ఫిర్యాదులను తీసుకుని సమాధానం చెప్పేందుకు సర్వీస్‌ కమిషన్‌ కార్యాలయంలో ప్రత్యేకంగా ‘‘రిడ్రెస్సెల్‌ సెల్‌’’ (ప్రత్యేక కాల్‌సెంటర్‌) అందుబాటులోకి తెచ్చారు. ‘ఏపీపీఎస్సీలో ఎన్నో చిక్కులు.. ఎవరూ విప్పరు!’’ శీర్షికన ఇటీవల‘ సాక్షి పత్రిక’లో కథనం ప్రచురితమైంది. ఇందులో రిడ్రెస్సెల్‌ సెల్‌ ఏర్పాటు చేయని సర్వీస్‌ కమిషన్‌ నిర్లక్ష్యాన్ని ఎండగట్టడంతో పాటు అభ్యర్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సాక్షి కళ్లకుకట్టింది. 

అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించినా ‘రిజెక్ట్‌’ అవుతున్నాయని, అన్నీ సక్రమంగా నమోదు చేసినా తప్పు ఎక్కడ జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతున్న తీరును అధికారుల ముందుంచింది.  దీంతో సర్వీస్‌ కమిషన్‌ అధికారులు చర్యలు తీసుకున్నారు. అభ్యర్థుల నుంచి వచ్చే ఫిర్యాదులను అందుకునేందుకు ప్రత్యేకంగా ఆరు ఫోన్‌ నంబర్లతో రిడ్రెస్సెల్‌ సెల్‌ను అందుబాటులోకి తెచ్చారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఫిర్యాదులు అందుకుని అభ్యర్థులకు సమాధానం చెప్పడంతోపాటు సమస్యలను పరిష్కరించే ఏర్పాట్లు చేశారు. అలాగే, పీజు చెల్లింపు, ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ఏపీ ఆన్‌లైన్‌ నుంచి కూడా సిబ్బందిని ఈ రిడ్రెస్సెల్‌ సెల్‌లో నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement