డీఎస్సీ–2026 రోస్టర్‌ విడుదల | DSC 2026 Roster Released | Sakshi
Sakshi News home page

డీఎస్సీ–2026 రోస్టర్‌ విడుదల

Nov 12 2026 5:47 AM | Updated on Nov 12 2026 5:47 AM

DSC 2026 Roster Released

డిగ్రీ విద్యార్థులకు ఒకలా.. పీజీలకు ఒకలా అవకాశం

ప్రభుత్వ తీరుపై అభ్యర్థులు గగ్గోలు

ఏడాది కాలంగా తీసుకున్న శిక్షణ పనికిరాకుండా పోయిందని ఆవేదన

సాక్షి, అమరావతి: 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి సామాజికవర్గాల వారీగా రోస్టర్‌ను పాఠశాల విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. ఇప్పటివరకు ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలని చదువుతున్న చాలామంది అభ్యర్థులకు ఇది శరాఘాతంగా మారింది. అనేక జిల్లాల్లో పోస్టులు లేకపోవడం, ఉన్న ఒకట్రెండు పోస్టులు రిజర్వు కావడంతో అభ్యర్థులు కంగుతిన్నారు. ఏడాది కాలంగా తీసుకుంటున్న శిక్షణ ఇప్పుడు ఎందుకూ పనికిరాకుండా పోయిందని వారు వాపోతున్నారు. ప్రభుత్వ తీరుతో తాము అన్ని విధాలా నష్టపోయామని గగ్గోలు పెడుతున్నారు. 

అక్టోబర్‌ 13న పాఠశాల విద్యాశాఖ ప్రాథమిక (బ్రీఫ్‌) నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఆ తర్వాత 2,721 పోస్టులతో అక్టోబర్‌ 13న షార్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన అధికారులు అందులో జిల్లాల వారీగా పోస్టులు ప్రకటించారు. సమగ్ర వివరాలతో కూడిన వివరణాత్మక నోటిఫికేషన్‌ను ఈనెల 4న విడుదల చేసినా సామాజిక రిజర్వేషన్లు, కేటగిరీల వారీ రోస్టర్‌ పాయింట్లను చేర్చలేదు. దీంతో ‘డీఎస్సీ–2026పై అయోమయం’ శీర్షికతో బుధవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీంతో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభయ్యే కొన్ని నిమిషాల ముందు రోస్టర్‌ విడుదల చేయడం గమనార్హం. 

2024 వరకే డిగ్రీ విద్యార్థులకు ఛాన్స్‌?
ఇక బుధవారం ప్రారంభమైన డీఎస్సీ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియలో విద్యాశాఖ నిర్లక్ష్యం వెలుగుచూసింది. అభ్యర్థుల విద్యార్హతల నమోదులో 2026లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన వారికి అవకాశం కల్పించగా, గ్రాడ్యుయేషన్‌ (డిగ్రీ) మాత్రం 2024 వరకే అవకాశం ఇచ్చారు. దీంతో 2025, 2026లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకునేందుకు ఆస్కారం లేకపోయింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement