జనసేన వీర మహిళపై టీడీపీ దాడి? | TDP Leaders Attack On Janasena Veera Mahila Sugunamma | Sakshi
Sakshi News home page

జనసేన వీర మహిళపై టీడీపీ దాడి?

Oct 6 2026 11:39 AM | Updated on Oct 6 2026 11:43 AM

TDP Leaders Attack On Janasena Veera Mahila Sugunamma

అన్నమయ్య జిల్లా : ‘మండలంలోని కొంత మంది తెలుగుదేశం పార్టీ నాయుకులు.. నిన్ను చంపి రమ్మన్నారు’అని వాళ్ల పేర్లు చెప్పి ఓ వ్యక్తి దాడి చేశాడని జనసేన పార్టీకి చెందిన సుగుణమ్మ తెలిపారు. మండల పరిధిలోని బండ కాడ ఈడిగపల్లికి చెందిన జనసేన వీర మహిళ సుగుణమ్మ డిప్యూటీ సీఎం గ్రాంట్‌లో రూ.30 లక్షలు ఆ ఊరి సీసీ రోడ్ల నిర్మాణం కోసం తెచ్చింది. అదే గ్రామానికి చెందిన కొంత మంది దారిలో తాత్కాలిక గుడిసెలు వేసి అడ్డంకి చేస్తుండగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. తహసీల్దార్‌ పట్టించుకోక పోగా అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆమె ఇంటి మీదికి పోయి.. రోడ్డు తెస్తావా అంటూ వీరంగం చేసి రాయితో తల మీద బలంగా కొట్టడంతో తీవ్ర గాయం అయింది. ఆమె రాయచోటి ప్రభుత్వ హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స పొందుతోంది. 

సుగుణమ్మ జనసేనలో లేరు : మండల నాయకులు
సుండుపల్లి టీడీపీ నాయకుడు చప్పిడి మహేశ్‌ నాయుడుకు నిన్న జరిగిన వ్యక్తిగత గొడవతో ఎలాంటి సంబంధం లేదని జనసేన నాయకులు తెలిపారు. సుగుణమ్మ గత ఏడాది కాలంగా జనసేనలో లేరని, వ్యక్తిగత వివాదంలో పార్టీని లాగి చెడ్డపేరు తీసుకురావద్దని సూచించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement