యువకుడిపై నలుగురు వ్యక్తుల దాడి | Four people attacked a young man in Nellore | Sakshi
Sakshi News home page

యువకుడిపై నలుగురు వ్యక్తుల దాడి

Oct 6 2026 11:49 AM | Updated on Oct 6 2026 11:54 AM

Four people attacked a young man in Nellore

నెల్లూరు జిల్లా: పాత వివాదాల నేపథ్యంలో ఓ యువకుడిపై నలుగురు వ్యక్తులు దాడి చేశారు. ఈ వీడియో సోమవారం సోషల్‌ మీడియాలో వైరలైంది. వెంకటాచలం సీఐ అంకమ్మ కథనం మేరకు.. ఇడిమేపల్లి పంచాయతీ పలుకూరువారిపాళెం గ్రామానికి చెందిన సంపత్‌ అనే యువకుడు గత నెల 16వ తేదీన వినాయక నిమజ్జనం సందర్భంగా చరణ్‌పై దాడి చేశాడు. ఇలా ఎందుకు చేశావని అదే గ్రామానికి చెందిన అంకయ్య.. సంపత్‌ను ప్రశ్నించాడు. 

అతను ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని శేషు, అన్వేషి రవికి చెప్పాడు. గత నెల 28 తేదీన గ్రామ సమీపంలోని చెరువు వద్దకు నలుగురూ అంకయ్యను పిలిచి తీవ్రంగా దాడి చేయడమే కాకుండా, బీరు బాటిళ్లతో చంపేస్తామని బెదిరించారు. ఈ ఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన నలుగురు వ్యక్తులపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement