కృష్ణా జిల్లా: ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల కేంద్రమైన తోట్లవల్లూరులో జరిగింది. వివరాల ప్రకారం.. గ్రామంలోని పీహెచ్‌సీకి సమీపంలో నివసించే పోతుగంటి సత్యన్నారాయణ చిన్న కుమార్తె లక్ష్మీప్రియాంక(27)కు గొల్లపూడికి చెందిన వేల్పూరి అశోక్‌కుమార్‌తో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది.
దంపతుల మధ్య గొడవలు జరగటంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి లక్ష్మీప్రియాంక పుట్టింట్లోనే ఉంటోంది. గత శనివారం భర్త అశోక్‌కుమార్ కోర్టు నోటీస్‌ను లక్ష్మీప్రియాంకకు పంపించాడు. దీంతో ఆమె అదే రోజు గొల్లపూడిలోని భర్త ఇంటికి వెళ్లి వచ్చింది. సోమవారం తల్లిదండ్రులు సత్యన్నారాయణ, ధనలక్ష్మి విజయవాడలోని ఆస్పత్రికి వైద్యచికిత్స కోసం వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఇంట్లో ఉరేసుకుని విగతజీవిగా ఉన్న కుమార్తె మృతదేహాన్ని చూసిన ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తన ఆత్మహత్యకు భర్త, అత్త, చిన్నత్త, ఆడపడుచులే కారణమని మృతురాలు లక్ష్మీప్రియాంక రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు లభ్యమైంది. ఘటనా ప్రాంతాన్ని తహసీల్దార్ కుసుమకుమారి, పమిడిముక్కల సీఐ చిట్టిబాబు సందర్శించి పరిశీలించారు. సత్యన్నారాయణ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కిషోర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


