ఫ్లాట్‌ఫాం టికెట్, రూ. 500 ఫైన్‌‌ : ఏకిపారేస్తున్న నెటిజన్లు | Man fined Rs 500 after platform ticket expires internet divided | Sakshi
Sakshi News home page

ఫ్లాట్‌ఫాం టికెట్, రూ. 500 ఫైన్‌‌ : ఈ విషయం తెలుసా మీకు?

Oct 5 2026 4:07 PM | Updated on Oct 5 2026 4:37 PM

Man fined Rs 500 after platform ticket expires internet divided

రైలు ప్రయాణాల్లో చాలా వింత వింత అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి.  అలా మహారాష్ట్రలోని కళ్యాణ్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఒక ఘటన నెట్టింట చర్చకు దారి తీసింది. మనం ఎక్కాల్సిన రైలు జీవిత కాలం లేటు అన్నట్టుగానే  ఒక వ్యక్తి రైలు కోసం ఎదురు చూస్తుండగా  అనుకోని ఘటన  ఎదురైంది. దీంతో  అతనికి రూ. 500 ఫైన్‌ విధించారు.దీంతో  తన అనుభవాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో అది   వైరల్‌గా మారింది.

ఎక్స్ (X) వేదికగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన ప్రకారం, ఒక వ్యక్తి తన కుటుంబాన్ని రైలు ఎక్కించడానికి కళ్యాణ్ రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. ఇందుకోసం ఫ్లాట్‌ఫాం టికెట్‌ కూడా కొనుగోలు చేశారు. కానీ  మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరాల్సిన రైలు సుమారు 2 గంటలకు వస్తుందని మొదట తెలిపారు. ఆ లేటు కాస్తా అలా కొనసాగుతూ,సాయంత్రం 5 గంటల వరకు  వచ్చింది.  వచ్చింది రా నాయనా అనుకుంటూ, తన వాళ్లని  రైలెక్కించి, అన్ని జాగ్రత్తలు చెప్పి , వెనక్కి వస్తుండగా  టీటీఈ అడ్డుకున్నారు.  ప్లాట్‌ఫాం టికెట్ చూపించమన్నాడు.  ఇక్కడే ఆయనకు  షాక్‌ తగిలింది.   మీ ప్లాట్‌ఫాం టికెట్ కేవలం రెండు గంటలు మాత్రమే చెల్లుబాటు అవుతుందని, నిర్ణీత గడువు దాటిపోయిందంటూ అతనికి రూ. 500 జరిమానా విధించారు.

నెటిజన్ల స్పందనలు

రైలు ఆలస్యం కావడం వల్ల స్టేషన్‌లో ఎక్కువ సమయం ఉండాల్సి వస్తే  జరిమానా పేరుతో శిక్షించడం ఎంతవరకు సమంజసమని పలువురు నెటిజన్లు  ప్రశ్నించారు. అయితే ప్లాట్‌ఫాం టికెట్‌కు నిర్దిష్ట సమయ పరిమితి ఉంటుందని, అది ఏ రైలుతోనూ ముడిపడి ఉండదని మరికొందరు వాదించారు.

రైల్వే శాఖ స్పందన: ఈ పోస్ట్ వైరల్ కావడంతో 'రైల్వే సేవా' (RailwaySeva) స్పందించడం విశేషం. సంబంధిత అధికారులకు సమాచారం అందించామని @drmmumbaicr ట్యాగ్ చేస్తూ బదులిచ్చింది. చివరికి ఫలితం ఎలా ఉంటుందో  చూడాలి మరి.  ఈ ఘటన రైలు ఆలస్యం కారణంగా ప్రయాణికులు ఊహించిన దానికంటే ఎక్కువసేపు స్టేషన్‌లో ఉండవలసి వచ్చినప్పుడు వారికి జరిమానా విధించాలా వద్దా అనే దానిపై చర్చను రేకెత్తించింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement