నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ ప్రమాదం తప్పింది. నోయిడా నుంచి ఆగ్రా వెళ్తున్న స్లీపర్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ప్రయాణికులందరినీ సురక్షితంగా ఉండటంతో అందరూ భారీ ఊరట చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటన నాలెడ్జ్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
నోయిడా నుంచి ఆగ్రా వెళ్తున్న ఒక స్లీపర్ బస్సు గ్రేటర్ నోయిడాలోని నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుంది. అయితు మంటలు చెలరేగిన వెంటనే బస్సులోని ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించారు. మంటలను ఆర్పడానికి పలు ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
नोएडा-ग्रेटर नोएडा एक्सप्रेसवे पर मंगलवार शाम सेक्टर-148 के पास चलती बस में अचानक भीषण आग लग गई। बस में करीब 30 यात्री सवार थे। आग लगते ही यात्रियों में अफरा-तफरी मच गई। सभी यात्रियों को सुरक्षित बाहर निकाल लिया गया। @Uppolice @noidapolice https://t.co/9ltWpOUZsr
— Devendra singh (@dev_journol) October 6, 2026
ఇదీ చదవండి: నో షూస్, నో సూట్..1600 మీటర్ల రన్, అదీ చీరలో
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో, ఎక్స్‌ప్రెస్‌వే పక్కన బస్సు కాలిపోతుండగా, దట్టమైన పొగలు కమ్ముకోవడం, ప్రయాణికులు దాని పక్కనుంచి నడుచుకుంటూ వెళ్లడం కనిపిస్తుంది. ఆ తర్వాత అక్కడే గుమిగూడిన జనం చూస్తుండగా ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు కూడా రికార్డయ్యాయి.
ఇదీ చదవండి: కుక్కర్, బెల్ట్, మొబైల్ చార్జర్ : దుబాయ్‌లో కొత్త పెళ్లికూతురికి చిత్రహింసలు
కాగా వారం రోజుల క్రితం గ్రేటర్ నోయిడాలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై దాదాపు 30 నుంచి 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న మరో స్లీపర్ బస్సు కూడా ఇలాగే దగ్ధమైంది. తాజా ఘటనలో ప్రయాణికులంతా సకాలంలో బయటపడినప్పటికీ, జరిగిన ఆ ప్రమాదంలో ఒక మహిళ సహా కనీసం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.


