కుక్కర్‌, బెల్ట్‌, మొబైల్‌ చార్జర్‌ : దుబాయ్‌లో కొత్త పెళ్లికూతురికి చిత్రహింసలు | Kerala Woman Claims Assault By Husband In Saudi | Sakshi
Sakshi News home page

కుక్కర్‌, బెల్ట్‌, మొబైల్‌ చార్జర్‌ : దుబాయ్‌లో కొత్త పెళ్లికూతురికి చిత్రహింసలు

Oct 6 2026 4:10 PM | Updated on Oct 6 2026 4:44 PM

Kerala Woman Claims Assault By Husband In Saudi

కొత్తగా పెళ్లయ్యి, భర్తతో కొత్త జీవితాన్ని ఊహించుకొని మురిసిపోతూ సౌదీ అరేబియా విమానం ఎక్కిన నవ వధువుకు  భారీ షాక్‌ తగిలింది. వెళ్లిన అయిదురోజుల్లోనే ఆమెకు నరకం చూపించారు. చివరికి ఒంటినిండా గాయాలు, దెబ్బలతో కేరళలోని పుట్టింటి చేరింది. మూడు నెలల్లోనే  ఆమె కాపురం మూణ్నాళ్ల ముచ్చటగా మారిపోయిన తనకు న్యాయం కావాలంటూ పోరాటం చేస్తోంది. 

కేరళలోని కొల్లం జిల్లాకు చెందిన అంజు అనే   24 ఏళ్ల యువతి  సౌదీ అరేబియాలో ఉద్యోగం చేస్తున్న భర్త నందు దినేష్ (28) వద్దకు సెప్టెంబర్ 4న సౌదీ అరేబియాకు వెళ్లింది. సరిగ్గా వారం రోజుల గడిచాయో లేదో భర్త అత్తమామాల వేధింపులు మొదలైనాయి. ఇలా వరుసగా ఐదు రోజులపాటు ఆమెకు చిత్ర హింసల పాలు జేశారు. ఎన్నో అనుమానాలు ,అవహేళనలు అవమానాల తరువాత  ఎలాగోలా  సెప్టెంబర్ 30న కేరళకు తిరిగి వచ్చింది. భర్త దాష్టీకానికి సంబంధించిన ఫోటోలతో సహా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. నందుతో పాటు మామ దినేష్, అత్త జగదమ్మల కూడా కేసు నమోదైంది. 

దీని ప్రకారం  వీపు, భుజాలు, పై చేతులపై  వాతలు తేలిఉన్నాయి. చర్మంపై గడ్డం కట్టిన ఆనవాల్లు, నడుము భాగంలో కూడా మరికొన్ని గాయాలు కూడా ఉన్నాయి. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు బాధితురాల్ని  కొల్లం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందారు. వైద్య పరీక్షల అనంతరం పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. గాయాలు చాలా పాతవి కావడంతో డాక్టర్లు కుట్లు వేయలేమని చెప్పారని, రెండు గాయాలకు కుట్లు పడాల్సి వచ్చిందని అంతేకాదు తన భర్త తన చదువు సర్టిఫికెట్లన్నీ తీసుకున్నాడని అంజు ఆరోపించింది.

కత్తి గురిపెట్టి చంపుతానని బెదిరించేవాడు. అనుమానంతో లేనిపోని  అబద్ధపు కథలను రికార్డు చేయించి, నరకం చూపించాడని, ఒక సైకోలా ప్రవర్తించాడని వాపోయింది. చాలామందితో సంబంధాలు పెట్టుకుని, ఆ వీడియోలను పోర్న్ సైట్లలో అప్‌లోడ్ చేసి డబ్బు సంపాదిస్తానని బలవంతంగా చెప్పించారని  కూడా చెప్పింది. తానొక సెక్స్ స్లేవ్ అని చెప్పించి, తన కుటుంబానికి, సర్కిల్‌లో ఉన్న అందరికీ పంపాడని కూడా కన్నీటి పర్యంతమైంది. తనపై దాడి చేయడానికి కుక్కర్, బెల్ట్, రాయి గ్రైండర్ ఉపయోగించాడని, అలాగే కత్తి, స్క్రూడ్రైవర్‌లతో లోతుగా గాయపడకుండా పొడవడానికి ఉపయోగించాడని ఆమె పేర్కొన్నారు. తాను తిరిగి వచ్చిన తర్వాత చికిత్స అందించిన డాక్టర్లు ఆమె గాయాల జాబితాతో మూడు పేజీల కాగితాన్ని నింపారని చెప్పడం విశేషం. 

ఇదీ చదవండి: హవ్వ..బీజేపీ ఎమ్మెల్యే బంగ్లా క్లీనింగ్‌కు ఫైర్‌ ఇంజీనా? వీడియో వైరల్‌

అంతేనా తన మాజీ గర్ల్‌‌ఫ్రెండ్స్‌తో పోల్చి అంజూని అవమానించేవాడు. నందుకి పెళ్లికి ముందే తనపై అనుమానం ఉన్నప్పటికీ, పెళ్లైన తర్వాతే అసలు వేధింపులు మొదలయ్యాయని, దుబాయ్‌ వెళ్లినాక మరింత శృతిమించాయని, ఆఖరికి  తిండి కూడా పెట్టకుండా తన ఫోన్, లాప్‌టాప్‌లను లాక్కున్నాడని ఆమె తెలిపింది. తనకు న్యాయం జరిగే వరకు న్యాయపోరాటం చేస్తానని బాధితురాలు స్పష్టం చేసింది.   కాగా ఈ ఏడాది జూన్‌లో ఈ జంట వివాహం జరిగింది.  మరోవైపు నిందితుడిని సౌదీ అరేబియా నుంచి వెనక్కి రప్పించేందుకు పోలీసులు చర్యలు ప్రారంభించినట్లు రాష్ట్ర మంత్రి బిందు కృష్ణ తెలిపారు.

ఇదీ చదవండి: ఫ్లాట్‌ఫాం టికెట్, రూ. 500 ఫైన్‌‌ : ఈ విషయం తెలుసా మీకు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement