గుజరాత్‌లోని దాహోద్ జిల్లాలో ఒక బీజేపీ నేత బంగ్లాను శుభ్రం చేయించుకునేందుకు అగ్నిమాపక శాఖ వాహనాన్ని దుర్వనియోగం చేశారన్న ఆరోపణలు సంచలనంగా మారాయి. ధన్‌పూర్ తాలూకాలోని ఎమ్మెల్యే బచుభాయ్ ఖబాద్ నివాసం వద్ద దేవ్‌గఢ్ బారియా మున్సిపాలిటీకి చెందిన ఫైర్ ఇంజీన్ బంగ్లా చుట్టూ నీటిని చల్లుతున్నవీడియో వెలుగులోకి రావడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్చకు దారి తీసింది.
అత్యవసర సేవలకు సంబంధించిన అగ్నిమాపక వాహనాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి మనుషుల్ని కాపాడటానికి వాడాల్సిన వాహనం బీజేపీ ఎమ్మెల్యే సేవలో తరిస్తోంది విమర్శలు చెలరేగాయి. అంతేకాదు ఈ వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత, ఖబాద్ నుండి రూ. 2,700 రుసుము వసూలు చేయడం గమనార్హం. అయితే దీనిపై అధికారుల వివరణ ఎలా ఉందంటే..
ఈ ఘటనపై దేవ్‌గఢ్ బారియా మున్సిపల్ చైర్‌పర్సన్ ఘమేష్ కలాల్ స్పందిస్తూ అగ్నిమాపక వాహనాన్ని పంపమని కోరుతూ ఎమ్మెల్యే నుండి తనకు ఫోన్ వచ్చిందనీ , దీంతో ఏదో ప్రమాదం అనిభావించిన వెంటనే ఫైర్ ఇంజీన్ పంపానని తెలిపారు. అయితే ఎమర్జెన్సీ సేవకు గాకుండా, తమ బంగ్లాను శుభ్రం చేయమని అడుగుతున్నట్లు సిబ్బంది తమ అధికారికి సమాచారం అందించారని తెలిపారు. దీంతో ఆ పనిని చేయవద్దని అగ్నిమాపక అధికారి వెంటనే వారికి సూచించారని వెల్లడించారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారి కూడా ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చారని, అలా చేయవద్దని ఆదేశించడంతోపాటు, అలాగే వాహన ప్రయాణానికి అయిన ఖర్చును వసూలు చేయాలని చెప్పానని కలాల్ తెలిపారు.
ఇదీ చదవండి: ఫ్లాట్‌ఫాం టికెట్, రూ. 500 ఫైన్ : ఈ విషయం తెలుసా మీకు?
#WATCH | Dahod, Gujarat: A controversy has erupted in Dahod district after an emergency fire tender was allegedly deployed to wash the bungalow of Devgadh Baria MLA and former minister Bachubhai Khabad. A video of the incident has gone viral on social media. After the matter came to light, a fee of ₹2,700 was collected from MLA Bachubhai Khabad. (05.10) (Visuals from Bachubhai Khabad's house and local fire station)
— ANI (@ANI) October 6, 2026
అలాగే దేవ్‌గఢ్ బారియా మున్సిపల్ కార్పొరేషన్ అగ్నిమాపక అధికారి మయూర్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, పిపెరో గ్రామంలోని ఒక సంఘటనకు సంబంధించి తన పై అధికారి ధర్మేష్-భాయ్ , అగ్నిమాపక వాహనాన్ని అక్కడికి పంపాలని తనకు సూచించారని తెలిపారు. తీరా అక్కడికెళ్లాక ఆయన అనుచరులు ఇంటిని కడగమని మమ్మల్ని అడిగారు, ముఖ్యంగా ముందు భాగం నుండి కడగడం ప్రారంభించాలని సూచించారని చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై పై అధికారులు దర్యాప్తు చేయనున్నారని తెలిపారు.
ఈ మొత్తం వ్యవహారంపై సోషల్ మీడియాలో దుమారం రేగింది. ఫైర్ ఇంజన్లు ఉన్నది మనుషుల ప్రాణాలను కాపాడటానికి వినియోగించాల్సిన సేవలను, వాహనాలను ఎమ్మెల్యేలకు ఊడిగం చేయడానికి ఉపయోగించడం సిగ్గు సిగ్గు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


