పాట్నా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం బీహార్‌లోని వైశాలిలో ప్రారంభించిన ఆరు వరుసల నితీశ్ సేతుపై రాజకీయ రగడ చోటుచేసుకుంది. ప్రారంభోత్సవం జరిగిన కొన్ని గంటలకే ఆర్జేడీ కార్యకర్తలు వంతెనపై ఆందోళనకు దిగారు. అధికార ఎన్డీయేకు సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లను చించివేస్తూ.. లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ యాదవ్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. బైకులపై పెద్ద సంఖ్యలో వచ్చిన ఆర్జేడీ కార్యకర్తలు పార్టీ జెండాలు ప్రదర్శిస్తూ హంగామా సృష్టించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అయితే, ఈ ఘటన జరిగిన సమయంలో పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ భారీగా చేరుకున్న కార్యకర్తల హడావుడితో పరిస్థితిని అదుపు చేయడం కష్టంగా మారింది. దాదాపు 40 నిమిషాల పాటు ఈ గందరగోళం కొనసాగింది. మరోవైపు.. ఈ ఘటనపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. అభివృద్ధి కార్యక్రమాలను స్వాగతించాల్సింది పోయి, పోస్టర్లు చించుతూ రాజకీయ హంగామా చేయడం ఏమిటని బీజేపీ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ శర్మ ప్రశ్నించారు. బీహార్ ప్రజలకు వంతెనలు, అభివృద్ధి కావాలని.. పోస్టర్లు చించివేసే రాజకీయాలు అవసరం లేదని విమర్శించారు.
Gamcha effect !! People tearing down Modijis banners and cutouts after the inauguration of the Nitish Setu Bridge in Bihar. Praands, it's over !! https://t.co/JG3JAdfYys
— Sini (@SiniiMayo) November 22, 2026
వంతెన పేరుపై మరో వివాదం
ఇదిలా ఉండగా.. వంతెనకు నితీశ్ కుమార్ పేరు పెట్టడాన్ని ఆర్జేడీ నేత, ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ తప్పుబట్టారు. ఈ వంతెనకు పదో సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ పేరు పెట్టాలని గతంలో తాను అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ తీర్మానం ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవడం రాజకీయ ప్రేరేపిత చర్యగా అభివర్ణించారు. నితీశ్ కుమార్‌ను గౌరవించాలనుకుంటే మరో ప్రభుత్వ పథకానికి ఆయన పేరు పెట్టవచ్చని, కానీ ఈ వంతెనకు గురు గోవింద్ సింగ్ పేరు పెట్టాలన్న ప్రతిపాదనను పక్కనపెట్టడం సరికాదని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఈ వంతెనను నితీశ్ కుమార్ ఏడాదిన్నర క్రితమే ప్రారంభించారని, ఇప్పుడు మోదీ మళ్లీ ప్రారంభించడం ఏమిటని ప్రశ్నించారు.
ఆప్ అభ్యంతరం
వంతెన పేరు మార్పుపై పంజాబ్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. గురు గోవింద్ సింగ్ పేరుతో ఉన్న ప్రతిపాదనను పక్కనపెట్టడం సిక్కుల మనోభావాలను దెబ్బతీస్తుందని పంజాబ్ మంత్రి హర్‌పాల్ సింగ్ చీమా విమర్శించారు. దీంతో, మోదీ ప్రారంభించిన నితీశ్ సేతు ఇప్పుడు అభివృద్ధి ప్రాజెక్టు కంటే రాజకీయ వివాదాలతోనే వార్తల్లో నిలిచింది. ఒకవైపు ఆర్జేడీ కార్యకర్తల ఆందోళన.. మరోవైపు వంతెన పేరు చుట్టూ బీజేపీ, ఆర్జేడీ, ఆప్ మధ్య విమర్శలు.. బీహార్ రాజకీయాల్లో కొత్త దుమారం రేపాయి.
#WATCH Patna, Bihar: On PM Modi inaugurating the six-lane Kachchi Dargah–Bidupur Ganga bridge named Nitish Setu without former Bihar CM in attendance, Jan Suraaj founder and MLA Prashant Kishor says, "If Nitish Kumar was in Patna yesterday and went to the airport to welcome the Prime Minister—and given that this bridge has been named after him—he ought to have been present at the event. In fact, it is the members of the JD(U)—even more so than the BJP—who should explain this; they are the ones currently occupying positions of power and authority, all in Nitish Kumar’s name. They ought to clarify: where was their leader, Nitish Kumar, during this event? And if he was not there, why not? They owe an answer."
— ANI (@ANI) November 22, 2026
నితీశ్ ఎందుకు రాలేదు?
మోదీ ప్రారంభించిన వంతెన ప్రారంభోత్సవానికి నితీశ్ కుమార్ హాజరుకాకపోవడంపై జనసురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ప్రశ్నలు సంధించారు. నితీశ్ కుమార్ పేరు మీదే వంతెనకు ‘నితీశ్ సేతు’ అని పేరు పెట్టినప్పుడు, ఆయన ప్రారంభోత్సవ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరై ఉండాల్సిందని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీని స్వాగతించేందుకు నితీశ్ కుమార్ విమానాశ్రయానికి వెళ్లినప్పుడు, వంతెన ప్రారంభోత్సవానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఈ విషయంపై బీజేపీ కంటే జేడీయూ నేతలే సమాధానం చెప్పాలని అన్నారు. ప్రస్తుతం నితీశ్ కుమార్ పేరుతోనే అధికార పదవుల్లో కొనసాగుతున్న జేడీయూ నాయకులు తమ నాయకుడు ఎక్కడ ఉన్నారు? కార్యక్రమానికి ఎందుకు హాజరుకాలేదు? అన్న విషయాలను ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: పుట్టిన తేదీకి ఆధార్ తుది రుజువు కాదు


