తన బిడ్డలకు బంగారు భవిష్యత్తును పంచడంకోసం మాతృమూర్తులు ఎంతటి సాహసాని కైనా వెనుకాడరు. ఎన్నిక ప్రతికూల పరిస్థితులున్నా తమ లక్ష్య సాధనలో ముందడుగే వేదమంత్రం. తాజాగా జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా దుల్మి బ్లాక్ పరిధిలోని సోసో గ్రామానికి చెందిన కవితా కుమారి కూడా ఆ కోవలోకే వస్తారు. హోంగార్డ్ నియామకాల కోసం జరుగుతున్న శారీరక దారుఢ్య పరీక్షల్లో తన సంకల్ప బలంతో అభ్యర్థులందరికీ స్ఫూర్తిగా నిలిచారు. తన పిల్లల భవిష్యత్తు కోసం ఆమె పడ్డ కష్టం .పట్టుదలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హోంగార్డ్ నియామకాల కోసం జరుగుతున్న శారీరక దారుఢ్య పరీక్షకు గాను, రన్నింగ్ షూస్, ట్రాక్‌సూట్ గానీ ఏవీ లేకుండానే చీరలోనే ఆమె మండుతున్న ఎండలో చెప్పులు లేకుండానేపోటీలో పాల్గొన్నారు. అలా ఏకంగా 1,600 మీటర్ల పరుగు పందెంలో ఆమె పాల్గొన్నారు. అంతేకాదు నిర్దేశిత 10 నిమిషాల సమయానికి బదులుగా కేవలం ఆరు నిమిషాల్లోనే ఆమె పరుగును పూర్తి చేసి అందరిని ఆకట్టుకున్నారు. ఆమె పరుగుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఒక స్థానిక రన్నింగ్ గ్రూప్ ఆమెను సత్కరించాలని నిర్ణయించింది. అకాడమీ సభ్యులు ఆమె ఇంటికి వెళ్లి ఆమెను సన్మానించారు.
यह सुंदर तस्वीर झारखंड के रामगढ़ की है होमगार्ड बनने की उम्मीद में साड़ी पहनकर नंगे पांव दौड़ी महिला….! #jharkhand #homeguard #womenspower https://t.co/Yryuhwoelh
— Mukesh singh (@Mukesh_Journo) October 6, 2026
ఇదీ చదవండి: కుక్కర్, బెల్ట్, మొబైల్ చార్జర్ : దుబాయ్‌లో కొత్త పెళ్లికూతురికి చిత్రహింసలు
అయితే కవితకు భర్తలేడు. దీంతో తన ఇద్దరు చిన్న పిల్లలను, వృద్ధులైన అత్తమామలను పోషించాల్సిన బాధ్యత కవిత మీదే ఉంది. రన్నింగ్ షూస్ లేదా ట్రాక్‌సూట్ కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేకపోవడంతో, తనకు అందుబాటులో ఉన్న ఏకైక మార్గంలో ఆమె నియామక పరీక్షకు సిద్ధమయ్యారు. ఆమె ప్రతిరోజూ ఉదయం 4 గంటలకు లేచి చీరతోనే రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవారట. తన పిల్లలకు మంచి భవిష్యత్తును అందించడానికే తాను హోంగార్డ్‌లో చేరాలనుకుంటున్నట్లు కవిత చెప్పారు.
కాగా రామ్‌గఢ్ జిల్లాలో 284 హోంగార్డ్ పోస్టుల భర్తీ కోసం ఈ నియామక డ్రైవ్ జరుగుతోంది. అక్టోబర్ 24 నుండి నవంబర్ 5 వరకు ఈ ప్రక్రియను షెడ్యూల్ చేశారు. ఇందులో 50శాతం పోస్టులు మహిళలకు రిజర్వ్ చేయగా, ఇందులో వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలకు అదనంగా 5శాతం రిజర్వేషన్ కల్పించారు. అందుకే ఈ ఉద్యోగాన్ని ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. మహిళా అభ్యర్థుల్లో మరికొంతమంది కూడా చీరలోనే ఈ పోటీలో పాల్గొనడం గమనార్హం.
అయితే తమ లక్ష్యంకోసం చీరల్లో పరుగెత్తి తమ ప్రత్యేకతను చాటుకున్న మహిళా మణులూ గతంలో కూడా ఉన్నారు. ముఖ్యంగా కూతురి చదువు కోసం మహారాష్ట్రకు చెందిన 47 ఏళ్ల లతా భగవాన్ కరేమహిళ తన కూతురి కాలేజీ ఫీజు కట్టడం కోసం బారమతి మారథాన్‌లో నవవారీ చీర కట్టుకుని, చెప్పులు లేకుండా పరుగెత్తి గెలిచారు. అలాగే యూకేలో నివసిస్తున్న 41 ఏళ్ల ఒడిశాకు చెందిన మధుస్మిత జెనా దాస్ సంబల్‌పురి చీర కట్టుకుని 42.5 కిలోమీటర్ల మాంచెస్టర్ మారథాన్‌ను 3 గంటల 45 నిమిషాల్లో విజయవంతంగా పూర్తి చేసి రికార్డు సృష్టించింది. ముంబై మారథాన్‌లో 80 ఏళ్ల భారతి అనే వృద్ధురాలు చీర మరియు స్నీకర్స్ ధరించి, చేతిలో జాతీయ జెండాను పట్టుకుని పరుగెత్తి అందరికీ ఫిట్‌నెస్ స్ఫూర్తిగా నిలిచిన సంగతి విదితమే.
ఇదీ చదవండి: హవ్వ..బీజేపీ ఎమ్మెల్యే బంగ్లా క్లీనింగ్‌కు ఫైర్ ఇంజీనా? వీడియో వైరల్


