డెహ్రాడూన్: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి సావిత్రీ దేవి (91) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. వయోభారంతో పాటు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఉత్తరాఖండ్‌లోని పౌరీ గఢ్వాల్ జిల్లా పంచూర్ గ్రామంలో తుదిశ్వాస విడిచారు. యోగి ఆదిత్యనాథ్ సోదరుడు మహేంద్ర ఈ విషయాన్ని వెల్లడించారు.
గృహిణిగా ఉన్న సావిత్రీ దేవి పంచూర్ గ్రామంలో నివసించేవారు. గత కొన్ని నెలలుగా ఆమె ఆరోగ్యం పలుమార్లు క్షీణించింది. ఈ క్రమంలో యోగి ఆదిత్యనాథ్ ఆసుపత్రికి వెళ్లి తల్లిని పరామర్శించారు. మరోవైపు.. సావిత్రీ దేవి మృతి పట్ల ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తల్లి ప్రేమ, ఆశీస్సులు, ఆప్యాయత జీవితంలో అత్యంత విలువైనవని పేర్కొన్నారు. ఆమె మరణం కుటుంబానికి తీరని లోటని అన్నారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని యోగి ఆదిత్యనాథ్, ఆయన కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని కేదార్‌నాథుడిని ప్రార్థించారు. ‘ఓం శాంతి’ అంటూ సంతాపం తెలిపారు.
Uttar Pradesh CM Yogi Adityanath's mother, Savitri Devi, passes away. Uttarakhand CM Pushkar Singh Dhami expresses his condolences over her demise. https://t.co/R61u8D4zfr
— ANI (@ANI) November 20, 2026
ఇదీ చదవండి: సుప్రీంకోర్టులో విజయ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ


