ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన బాబా, 77 ఏళ్ల గంగా బక్ష్,తాను కఠినమైన శాకాహారినంటూ గొప్పలు చెప్పుకునేవాడు. కానీ ఒక అలవాటు తాతగారిని ఏడు రోజులపాటు ముప్పు తిప్పలు పెట్టింది. చివరికి గొంతులో ఇరుక్కున్న చేపముల్లును బయటికి తీయడంతో బతుకు జీవుడా అంటూ అసలు రహస్యాన్ని ఒప్పుకున్నాడు. అసలు ఏమైందంటే..
ఇంట్లో అందరూ శాకాహారులే, కానీ బాబాగా చెప్పుకునే గంగా బక్ష్ మాత్రం రహస్యంగా చేపలు తినేవాడు. అవకాశం దొరికి నప్పుడల్లా రహస్యంగా చేపలు తినే గంగా బక్ష గొంతులో ఒకరోజు చేప ముల్లు ఇరుక్కుపోయింది. అతని కుటుంబం అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువెళ్ళింది. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా ఫలితం దక్కకపోవడంతో కాన్పూర్‌లోని గణేష్ శంకర్ విద్యార్థి మెమోరియల్ (GSVM) మెడికల్ కాలేజీ వైద్యులు, సుమారు ఏడు రోజులుగా గొంతులో ఇరుక్కుపోయిన ముల్లును ఎండోస్కోపీ ద్వారా ఆ ముల్లును తొలగించడంతో అతని బండారం బయటి పడింది. మొత్తం మీద ముల్లు తీసిన తర్వాత గంగా బక్ష్ పరిస్థితి బాగుపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి : అమితాబ్‌తో పాటు, అభిషేక్‌కు కూడా బెదిరింపుల కలకలం

గంగా బక్ష్ పాన్ దుకాణం నడుపుతూ ఉంటాడు. గొంతులో వాపు, గడ్డను గమనించిన తర్వాత వేరే ఏదో సమస్య ఉందని అనుమానించినట్లు డాక్టర్ ఆర్.కె. జోహ్రి తెలిపారు. చివరకు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంజయ్ కాలా ఆదేశాల మేరకు వైద్యుల బృందం ఎండోస్కోపీ ద్వారా గొంతులో ఇరుక్కుపోయిన వస్తువును తొలగించాక, అదొక చేప ముల్లు తెలిసిందన్నారు.. చేపలు తింటావా , పిల్లల బొమ్మ ఏదైనా గొంతులో ఇరుక్కుపోయిందా అని వైద్యులు అడిగినపుడుబాబా తొలుత ఒప్పుకోలేదు. తాను కఠినమైన శాకాహారినని, తనకు చేపలతో ఎలాంటి సంబంధం లేదని బుకాయించాడు. కానీ ఆ ముల్లును తీసిన తర్వాత "నేను దొంగతనం చేస్తూ పట్టుబడ్డాను" అంటూ బోసినవ్వులు నవ్వాడు. తాతయ్యకు చేపలు తినే అలవాటు బయటపడటంతో అతని మనవరాలు కూడా నవ్వేసింది.
ఇదీ చదవండి: 14 ఏళ్ల బంధానికి ముగింపు : మంత్రి భార్య ప్రకటన


