భక్తులకు శుభవార్త : ప్రతిరోజూ అదనంగా 5,000 వర్చువల్ క్యూ స్లాట్లు | Virtual Queue Slots for Sabarimala Darshan extended up to nov 30 and 5000 Additional | Sakshi
Sakshi News home page

భక్తులకు శుభవార్త : ప్రతిరోజూ అదనంగా 5,000 వర్చువల్ క్యూ స్లాట్లు

Nov 20 2026 1:23 PM | Updated on Nov 20 2026 1:23 PM

Virtual Queue Slots for Sabarimala Darshan extended up to nov 30 and 5000 Additional

Virtual Queue Slots for Sabarimala Darshan ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అయ్యప్ప భక్తులకు శుభవార్త అందించింది. నవంబర్ 30 వరకు వర్చువల్ క్యూ విధానం ద్వారా శబరిమలలో రోజుకు 5,000 మంది యాత్రికులకు అదనంగా దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది.

ప్రస్తుతం కొనసాగుతున్న మండల-మకరవిళక్కు యాత్రా సీజన్‌లో ఎక్కువ మంది భక్తులకు దర్శనం కల్పించేందుకు, ప్రతిరోజూ అదనపు వర్చువల్ క్యూ బుకింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు బోర్డు ప్రజా సంబంధాల విభాగం ప్రకటించింది.అదనపు వర్చువల్ క్యూ బుకింగ్లు ప్రతిరోజూ అందుబాటులోకి  వస్తాయి. అలాగే ఎక్కువ మంది భక్తులకు దర్శనం కల్పించేందుకు, నవంబర్ 21, 22 తేదీలలో 'స్పాట్ బుకింగ్' (నేరుగా బుక్ చేసుకునే) అవకాశాలను కూడా తదనుగుణంగా పెంచాలని బోర్డు నిర్ణయించింది. తాము కోరుకున్న తేదీలలో వర్చువల్ క్యూ లేదా స్పాట్ బుకింగ్ స్లాట్లను పొందలేని యాత్రికులకు ఈ అదనపు ఏర్పాట్లు ప్రయోజనం చేకూరుస్తాయని భావిస్తున్నారు. ఇంకా స్పాట్ బుకింగ్ స్లాట్లను పొందలేని భక్తులు ఈ అదనపు సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement